కోహ్లీనే కుక్క అంటావా?.. కాంగ్రెస్ నేతపై రెచ్చిపోయిన నెటిజన్లు..! 

భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ దీపావళి  సందర్భంగా పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీటర్లో ఓ వీడియోను విడుదల చేశాడు ‘పర్యావరణానికి హానీ కలిగించే క్రాకర్స్ కాల్చవద్దు.. ఈ దీపావళిని సింపుల్‌గా దీపాలు.. స్వీట్లతో మనకు నచ్చినవాళ్లతో సరదాగా జరుపుకుందాం’ అంటూ పిలుపునిచ్చాడు. అయతే కొందరు నెటిజన్లు మాత్రం కోహ్లీ పిలుపుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.‘నవంబర్ 5న నీ పుట్టిన రోజు అర్ధరాత్రి నువ్వు చేసింది ఏంటీ..?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ‘కోహ్లీ.. నువ్వు కుక్కవి.. అందుకే దీపావళి రోజున టపాసులు […]

Written By: NARESH, Updated On : November 16, 2020 11:33 am
Follow us on

భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ దీపావళి  సందర్భంగా పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీటర్లో ఓ వీడియోను విడుదల చేశాడు ‘పర్యావరణానికి హానీ కలిగించే క్రాకర్స్ కాల్చవద్దు.. ఈ దీపావళిని సింపుల్‌గా దీపాలు.. స్వీట్లతో మనకు నచ్చినవాళ్లతో సరదాగా జరుపుకుందాం’ అంటూ పిలుపునిచ్చాడు. అయతే కొందరు నెటిజన్లు మాత్రం కోహ్లీ పిలుపుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.‘నవంబర్ 5న నీ పుట్టిన రోజు అర్ధరాత్రి నువ్వు చేసింది ఏంటీ..?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ‘కోహ్లీ.. నువ్వు కుక్కవి.. అందుకే దీపావళి రోజున టపాసులు పేల్చవద్దంటున్నావ్’ అంటూ విమర్శలు గుప్పించారు. కోహ్లీ అందరికీ నీతులు చెప్పడంకాదు.. నీవ్వు పాటించు అంటూ మండిపడ్డారు. ఈక్రమంలోనే కోహ్లీకి మద్దుతుగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఉదిత్ రాజ్ నిలిస్తూనే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

Also Read: కోహ్లిపై దీపావళి బాంబ్‌ వేసిన ఫ్యాన్స్‌

విరాట్ మద్దతుగా రంగంలోకి దిగిన కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ ట్వీటర్లో వేదికలు పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విరాట్‌పై విమర్శలు చేసినవారిని దోపిడీదారులుగా.. దొంగలుగా.. మానవత్వంలేని మూర్ఖులంటూ అభివర్ణించాడు. కాగా ఉదిత్ సైతం విరాట్ ను అనుష్కశర్మ కుక్కగా పేర్కొనడం వివాదాస్పదంగా మారింది. దీంతో కోహ్లి అభిమానులు ఉదిత్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయం

దీంతో ఉదిత్ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చాడు. దీపావళి సందర్భంగా కోహ్లీ అభిమానులకు పిలుపునివ్వడం ఆహ్వనించదగిన విషయమన్నారు. అయితే కొందరు దుర్మార్గులు మాత్రం సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్నారని తెలిపారు. విరాట్ పై విమర్శలు చేసిన వాళ్లు మనషులే కాదన్నాడు. కుక్క విశ్వాసమైన జీవి అని దానిని స్థాయిని కూడా కొందరు నీచులు తగ్గించారంటూ ఘాటూగానే స్పందించాడు. అయితే ఉదిత్ వివరణపై కోహ్లీ అభిమానులు మాత్రం అసంతృప్తిని వ్యక్తం చేస్తుండటం గమనార్హం.