https://oktelugu.com/

వైసీపీలో అసమ్మతి.. అనూహ్య పరిణామం

ఏపీ అధికార పార్టీ వైసీపీలో అసమ్మతి రాగం మొదలైందా..? అధికారంలోకి వచ్చి ఏడాదిన్నరైనా కాకముందే నేతల మధ్య పొసగడం లేదా..? అవును ఈ తాజా పరిణామాలను చూస్తుంటే అందరిలోనూ అదే అనుమానం కలుగుతోంది. దళిత శిరోముండనం కేసులో స్పీడ్‌ పెంచాలని మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరితకు లేఖ రాశారు. ఈ లేఖ వైసీపీ ముఖ్యనేత త్రిమూర్తులు లక్ష్యంగా రాసినట్లుగానే అర్థమవుతోంది. Also Read: చీఫ్ జస్టిస్ కు జగన్ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 16, 2020 / 10:59 AM IST
    Follow us on

    ఏపీ అధికార పార్టీ వైసీపీలో అసమ్మతి రాగం మొదలైందా..? అధికారంలోకి వచ్చి ఏడాదిన్నరైనా కాకముందే నేతల మధ్య పొసగడం లేదా..? అవును ఈ తాజా పరిణామాలను చూస్తుంటే అందరిలోనూ అదే అనుమానం కలుగుతోంది. దళిత శిరోముండనం కేసులో స్పీడ్‌ పెంచాలని మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరితకు లేఖ రాశారు. ఈ లేఖ వైసీపీ ముఖ్యనేత త్రిమూర్తులు లక్ష్యంగా రాసినట్లుగానే అర్థమవుతోంది.

    Also Read: చీఫ్ జస్టిస్ కు జగన్ లేఖపై విచారణ.. నేడు ఏం జరుగనుంది?

    దళితుల శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులు ఏ1 నిందితుడిగా ఉన్నారని సుభాష్‌ ఆ లేఖలో పేర్కొన్నారు. 20 ఏళ్లుగా ఈ కేసు తేలకుండా త్రిమూర్తులు పలుకుబడితో తెలివిగా వ్యవహరిస్తున్నారని, ఈ కేసు విచారణకు రాకుండా వాయిదా వేయించుకుంటున్నారని తెలిపారు. ఈ తరుణంలో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ను మార్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. దళిత సామాజికవర్గానికి చెందిన బాధితులు త్రిమూర్తులుతో పోరాడే స్థాయి లేని నిస్సహాయులని ఆ లేఖలో ప్రస్తావించారు.

    Also Read: రాజాధిరాజా: జగన్‌ ఆస్థానంలో రాజగురువు!?

    అందుకే.. ఈ కేసుపై తగు చర్యలు తీసుకోవాలని ఆయన హోంమంత్రిని కోరారు. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో దశాబ్దాలుగా తోట త్రిమూర్తులు, పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు మధ్య వైరం నడుస్తోంది. వీరిద్దరూ ఎప్పుడూ ప్రత్యర్థి పార్టీల్లోనూ ఉండే వారు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చాక, తోట త్రిమూర్తులు అనూహ్యంగా వైసీపీ కండువా కప్పుకున్నారు. దీనిపైనా అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

    దళితుడికి శిరోముండనం చేసిన వ్యక్తిని పార్టీలోకి ఎలా తీసుకుంటారని వైసీపీలోని దళిత నేతలు కూడా ప్రశ్నించారు. తర్వాత పిల్లి సుభాష్ చంద్రబోస్‌ను ముఖ్యమంత్రి జగన్ రాజ్యసభకు పంపడంతో వారి మధ్య వివాదం ముగుస్తుందని అందరూ భావించారు. అయితే ఎంపీ పిల్లి మాత్రం తన ప్రత్యర్థి దళితుల విషయంలో తప్పు చేశారని, ఆ విషయంలో మాత్రం రాజీపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ తరుణంలో మరోసారి హోంమంత్రి సుచరితకు ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరి ఈ లేఖపై అటు జగన్‌.. ఇటు హోంమంత్రి ఎలా స్పందిస్తారో చూడాలి. వీరి మధ్య ఉన్న వైరాన్ని తగ్గించేందుకు ఎవరు రంగంలోకి దిగుతారనేది ఆసక్తికరంగా మారింది.