TS Job Calendar 2022: తెలంగాణలో సీఎం కేసీఆర్ వ్యూహాలు మారుతున్నాయి. నిరుద్యోగుల విషయంలో ఉద్యోగాల భర్తీ చేస్తామని చెప్పి వారిలోని అసంతృప్తిని దూరం చేసుకుంటున్నారు. ఇకపై ప్రతి సంవత్సరం ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తూ నియామకాలు చేపడతామని చెబుతున్నారు. దీంతో కాంట్రాక్టు ఉద్యోగులను కూడా క్రమబద్ధీకరణ చేసి ప్రతిపక్షాలకు చెక్ పెట్టారు. సీఎం ప్రకటనతో ప్రతిపక్షాలు ఖంగుతిన్నాయి. సీఎం వైఖరిలో మార్పు రావడానికి కారణాలు ఏంటనే దానిపై మల్లగుళ్లాలు పడుతున్నాయి.
నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ఉద్యమం చేసి అధికారంలోకి వచ్చాక వాటి గురించి మరిచిపోయారని ప్రతిపక్షాలు ప్రతిసారి ఎద్దేవా చేశాయి. ఇకపై వాటికి ఆ అవకాశం ఇవ్వకుండా చేయడమే ఉద్దేశంగా కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసమే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగవంతం చేసేందుకు ఉపక్రమించినట్లు సమాచారం. ఈ విషయంలో కేసీఆర్ ఇక ముందు చూపే అని గులాబీ నేతలు భావిస్తున్నారు.
Also Read: ముందస్తు కోసమే కేసీఆర్ నిరుద్యోగులకు వరాలు ప్రకటించారా?
ఇకపై ప్రతి సంవత్సరం ఉద్యోగాల కల్పన పారదర్శకంగా చేపట్టాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. నిరుద్యోగుల ఆశలు నెరవేర్చే ఉద్యోగాల కల్పన ప్రతి సంవత్సరం విడుదల చేసేందుకు నిర్ణయించింది. కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో నిరుద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఇక మీదట ఉద్యోగాల నియామక ప్రక్రియ చేపట్టేందుకు సర్కారు సుముఖంగా ఉండటంతో నిరుద్యోగ సమస్య తీరుతుందని ఆశిస్తున్నారు. దీనిపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు కూడా చెక్ పెడుతున్నారు.
నిరుద్యోగ సమస్యలపై ప్రతిపక్షాల వైఖరిని ఎండగట్టే ఉద్దేశంతోనే కేసీఆర్ ఈ సాహసం చేసినట్లు తెలుస్తోంది. దీని కోసం నిరుద్యోగుల సమస్య పరిష్కరించి ఉద్యోగాల భర్తీకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్నారు. అసెంబ్లీ వేదికగా కేసీఆర్ ప్రకటన ఉండటంతో అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ ఇకపై ముందుకు నడిచేందుకే నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇదే జరిగితే ప్రతిపక్షాలకు ఇక విమర్శలకు అవకాశం లేకుండా చేయడంలో కేసీఆర్ కృతకృత్యులైనట్లేనని చెబుుతున్నారు.
Also Read:కేసీఆర్ ప్రతిపక్షాల నోళ్లకు తాళం వేశారా?