మోడీకి కేసీఆర్ షాక్ ఇవ్వబోతున్నారా?

సీఎం కేసీఆర్ అందరితో సాన్నిహిత్యంగా ఉన్నట్లు కన్పించినా ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఎవరికీ తెలియదు. ఎవరూ ఊహించని విధంగా నిర్ణయాలు తీసుకుంటూ ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెడుతుంటారు. ఆయా పార్టీలు.. అభ్యర్థుల బలహీనతలను బేరీజు వేసుకొని పకడ్బంధీ వ్యూహాలు రచిస్తూ విజయాలు సాధిస్తుంటారు. గతంలో అందరి అంచనాలను తలకిందిస్తూ చేస్తూ ముందస్తు ఎన్నికలకు వెళ్లి విజయదుందుబీ మ్రోగించిన సంగతి తెల్సిందే..! గడిచిన ఏడేళ్లుగా తెలంగాణలో సీఎం కేసీఆర్ ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది. అయితే రాష్ట్రంలో […]

Written By: NARESH, Updated On : May 3, 2021 3:05 pm
Follow us on


సీఎం కేసీఆర్ అందరితో సాన్నిహిత్యంగా ఉన్నట్లు కన్పించినా ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఎవరికీ తెలియదు. ఎవరూ ఊహించని విధంగా నిర్ణయాలు తీసుకుంటూ ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెడుతుంటారు. ఆయా పార్టీలు.. అభ్యర్థుల బలహీనతలను బేరీజు వేసుకొని పకడ్బంధీ వ్యూహాలు రచిస్తూ విజయాలు సాధిస్తుంటారు. గతంలో అందరి అంచనాలను తలకిందిస్తూ చేస్తూ ముందస్తు ఎన్నికలకు వెళ్లి విజయదుందుబీ మ్రోగించిన సంగతి తెల్సిందే..!

గడిచిన ఏడేళ్లుగా తెలంగాణలో సీఎం కేసీఆర్ ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది. అయితే రాష్ట్రంలో మారుతున్న సమీకరణాల నేపథ్యంలో టీఆర్ఎస్ కు బీజేపీ ప్రత్యామ్నాయం మారింది. దుబ్బాక ఉప ఎన్నిక.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు బీజేపీ పోటీ ఇవ్వడంతో కేసీఆర్ అలర్ట్ అయ్యారు.

పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నాలుగు సీట్లు గెలువడం గాలివాటంగా అభివర్ణించిన కేసీఆర్ కు దుబ్బాక ఫలితం తర్వాత అసలు విషయం బోధపడింది. అవసరం మేరకు బీజేపీతో అంటకాడుతూ అటుపై అవసరం తీరాక మోడీపై కాలుదువ్వడం కేసీఆర్ అలవాటే. అయితే రాష్ట్రంలో బీజేపీ బలపడుతుండంతో కేసీఆర్ పంథాను మార్చుకున్నారు. బీజేపీపై ఒంటికాలుపై లేచే టీఆర్ఎస్ నేతలంతా కొద్దిరోజులుగా సైలంటయ్యారు.

జాతీయ రాజకీయాలపై ఆసక్తి చూపే సీఎం కేసీఆర్ టైం కలిసొచ్చినప్పుడల్లా మోడీపై విమర్శలు గుప్పించేవారు. ఇటీవల ఢిల్లీలో రైతులు కేంద్రానికి వ్యతిరేకంగా దీక్షలు చేపట్టడంతో కేసీఆర్ సైతం వారికి మద్దతు ప్రకటించారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం బలంగా ఉండటంతో సీఎం కేసీఆర్ పరోక్షంగానే రైతులకు మద్దతు ఇచ్చారు.

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ను కట్టడి చేయడంతో మోడీ ప్రభుత్వం విఫలం కావడం.. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ పెద్దగా ప్రభావం చూపకపోవడం కేసీఆర్ కు కలిసొచ్చింది. తమిళనాడు.. కేరళ.. పశ్చిమ బెంగాల్లో ప్రాంతీయ పార్టీలే సత్తా చాటడంతో మోడీ హవా తగ్గినట్లు కన్పిస్తోంది. దీంతో కేసీఆర్ సైతం మళ్లీ మోడీపై కాలు దువ్వేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

గతంలో ఫ్రెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ప్రస్తుతం కేంద్రంలో మోడీ హవా తగ్గుతుండటంతోపాటు రాష్ట్రాల్లో మళ్లీ ప్రాంతీయ పార్టీల హవా సాగుతున్నాయి. దీంతో సీఎం కేసీఆర్ మళ్లీ ఫ్రెడరల్ ఫ్రంట్ ఆలోచన చేస్తున్నట్లుగా కన్పిస్తోంది.

ఈమేరకు కలిసొచ్చే పార్టీలతో సంప్రదింపులు జరిపి మోడీ వ్యతిరేక శక్తులను ఏకం చేయబోతున్నారనే టాక్ విన్పిస్తోంది. అయితే ఇటీవలే ఢిల్లీ వెళ్లి మోడీ-అమిషాలను కలిసి శాలువాలతో సన్మానం చేసి వచ్చిన కేసీఆర్  ఇప్పుడు కాలు దువ్వుతారా? అనే ప్రశ్న తలెత్తుతోంది. అయితే రానున్న రోజుల్లో కేసీఆర్ బీజేపీని శరణు కోరుతారా? లేదంటే రణం చేస్తారా? అనేది మాత్రం వేచిచూడాల్సిందే..!