https://oktelugu.com/

‘పీకే’కు గట్టి పోటీ ఇస్తుందో ఎవరో తెలుసా?

ప్రస్తుత రాజకీయాల్లో పీకే(ప్రశాంత్ కిషోర్) గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. రెగ్యూలర్ గా పాలిటిక్స్ ను ఫాలో అయ్యే వారికి ప్రశాంత్ కిషోర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పీకే ఏ రాజకీయ పార్టీకి స్ట్రాటజిస్ట్ గా ఉంటే ఆ పార్టీనే అధికారంలోకి వస్తుందనే నమ్మకం చాలామంది నేతలతోపాటు ప్రజల్లోనూ ఉంది. అంటే ఆయన వ్యూహా.. ప్రతివ్యూహాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. పీకేను స్ట్రాటజిస్టుగా పెట్టుకున్న చాలా పార్టీలు అధికారంలోకి రావడంతో ఆయనపై ఎక్కడాలేని […]

Written By:
  • NARESH
  • , Updated On : May 3, 2021 / 02:16 PM IST
    Follow us on

    ప్రస్తుత రాజకీయాల్లో పీకే(ప్రశాంత్ కిషోర్) గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. రెగ్యూలర్ గా పాలిటిక్స్ ను ఫాలో అయ్యే వారికి ప్రశాంత్ కిషోర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పీకే ఏ రాజకీయ పార్టీకి స్ట్రాటజిస్ట్ గా ఉంటే ఆ పార్టీనే అధికారంలోకి వస్తుందనే నమ్మకం చాలామంది నేతలతోపాటు ప్రజల్లోనూ ఉంది. అంటే ఆయన వ్యూహా.. ప్రతివ్యూహాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.

    పీకేను స్ట్రాటజిస్టుగా పెట్టుకున్న చాలా పార్టీలు అధికారంలోకి రావడంతో ఆయనపై ఎక్కడాలేని అంచనాలు ఏర్పడ్డాయి. ఒకటి అరా మినహా చాలాసార్లు పీకే స్ట్రాటజిస్టుగా వ్యవహరిస్తున్న పార్టీలే అధికారంలోకి వచ్చాయి. ఏపీలోనూ జగన్మోహన్ రెడ్డి బంపర్ మెజార్టీతో అధికారంలోకి రావడానికి పీకే స్ట్రాటజీ లు ఎంతగానో దోహదపడ్డాయి.

    ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోనూ ‘పీకే’ స్ట్రాటజిస్టుగా వ్యవహరించిన పార్టీలే అధికారంలోకి వచ్చాయి. తమిళనాడులో డీఎంకే.. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వం వహిస్తున్న టీఎంసీకి ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజిస్టుగా వ్యవహరించారు. ఇదే సమయంలోనూ పీకే పోటీగా ఆయన శిష్యులు రంగంలోకి దిగారు. వీరు కూడా గురువుకు తగ్గ శిష్యులుగా పేరు తెచ్చుకోవడం గమనార్హం.

    తమిళనాడులో డీఎంకే-కాంగ్రెస్ కూటమికి పీకే స్ట్రాటజిస్టుగా వ్యవహరించగా అన్నాడీఎంకే-బీజేపీ కూటమికి పీకే శిష్యుల్లో ఒకడైన సునిల్ కణుగోలు స్ట్రాటజిస్టుగా వ్యవహరించాడు. ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమి ఘోర పరాజయం చవిచూస్తుందని సర్వేలు చెప్పగా వాటన్నింటిని తలకిందులు చేస్తూ సునిల్ కణుగోలు ఆ కూటమికి మంచి రిజల్ట్ తీసుకురావడంలో విజయం సాధించాడు.

    తమిళనాడుకు చెందిన సునిల్ కణుగోలు తొలుత డీఎంకే పార్టీకి స్ట్రాటజిస్టుగా వ్యవహరించాడు. అయితే డీఎంకే పీకేతో ఒప్పందం కుదుర్చుకోవడంతో సునిల్ అన్నాడీఎంకే స్ట్రాటజిస్టుగా మారిపోవాల్సి వచ్చింది. గ్రూపు రాజకీయాలతో ఎవరికీ వారే అన్నట్లుగా మారిన అన్నాడీఎంకేకు మంచి రిజిల్ట్ తీసుకురావడంతో సునిల్ కణుగోలు కీలకంగా వ్యవహరించి ఆ పార్టీ తలెత్తుకునేలా చేశాడు. దీంతో ఆయనకు ఫుల్ డిమాండ్ పెరిగిపోయింది.

    ఇక ప్రశాంత్ కిషోర్ కొంతమందితో ఐప్యాక్ సంస్థను స్థాపించి పలు రాజకీయ పార్టీలకు స్ట్రాటజిస్టుగా సేవలందించారు. తిమ్మిని బమ్మి చేసి విజయాలు అందించడంతో ఆయనకు ఫుల్ డిమాండ్ పెరిగింది. రాజకీయ పార్టీలు పోటీలుపడి ప్రశాంత్ కిషోర్ సేవలను వాడుకున్నాయి.

    ప్రశాంత్ కిషోర్ సహచరులు సైతం సొంత స్ట్రాటజీలను ఏర్పాటు చేసుకున్నారు. వీరిలో ఒకరు సునిల్ కణుగోలు. ఏదిఏమైనా ‘పీకే’ శిష్యులు ఆయనకు ధీటుగా వ్యూహాలు రచిస్తూ స్ట్రాటజిస్టుగా రాణిస్తుండటంతో రాబోయే రోజుల్లో ఐప్యాక్ పరిస్థితి ఏంటా? అనే చర్చ జోరుగా సాగుతోంది.