KCR- BRS: “నేషనల్ పాలిటిక్స్.. ఐ డోంట్ లైక్ ఇట్. ఐ అవాయిడ్. బట్ నేషనల్ పాలిటిక్స్ లైక్స్ మీ”.. అన్నట్టుగా ఉంది కేసీఆర్ వ్యవహారం. దసరా ముందు జాతీయ రాజకీయాల్లోకి వెళ్తా. దేశం చరిత్రనే మార్చేస్తా. చక్రాలు తిప్పుతానని కెసిఆర్ హరి వీర భయంకరమైన స్థాయిలో స్పీచ్ ఇచ్చాడు. కానీ ఊదు కాలింది లేదు, పీరి లేచింది లేదు. వాస్తవానికి కెసిఆర్ అనుకున్నంత పొలిటికల్ వ్యాక్యుమ్ ఢిల్లీలో లేదు. కానీ తన సొంత మీడియాలో మాత్రం దేశం మొత్తం ఆగం అయిపోతుందని రకరకాల కథనాలు రాయించి, తానే ప్రత్యామ్నాయమని ప్రచారం చేసుకున్నాడు. పలు రైతు సంఘాల నాయకులను పిలిపించుకొని జేజేలు కొట్టించుకున్నాడు. కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల్లో రైతు సంఘాల ముసుగులో ధర్నాలు చేయించాడు. పంజాబ్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో సైనికుల కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున చెక్కులు ఇచ్చాడు. అనుకున్నప్పటికి అనుకున్నంత ఫాయిదా దక్క లేదు.

బీఆర్ఎస్ ను ప్రమోట్ చేసేందుకే
దసరా సందర్భంగా కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన చేసిన నేపథ్యంలో.. ఆయన అనుకున్నంత ఈజీగా జాతీయస్థాయిలో మైలేజీ దక్కడం లేదు. ఇదే క్రమంలో జాతీయస్థాయిలో ఎక్స్పోజ్ కావాలని మొయినాబాద్ ఫామ్ హౌస్ డీల్స్ ను తెరపై తీసుకొచ్చాడు. కానీ దీనిని కూడా జాతీయస్థాయిలో మీడియా లైట్ తీసుకుంది. ఈ కేసులో అనుకున్నంత స్టఫ్ లేకపోవడంతో పెద్దగా ప్రయారిటీ ఇవ్వడం లేదు. పైగా భారత్ జోడో యాత్ర పేరుతో రాహుల్ గాంధీ తెలంగాణలో పాదయాత్ర చేస్తున్న నేపథ్యంలో ఆయనకు జనాలు బ్రహ్మరథం పడుతున్నారు. మరోవైపు మునుగోడు ఎన్నిక నేపథ్యంలో బిజెపి దండయాత్రలా కదిలి వచ్చింది. దీనికి తోడు ఢిల్లీ లిక్కర్స్ స్కామ్ లో కవిత పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ నేపథ్యంలోనే ఈ విషయాలను సైడ్ ట్రాక్ పట్టించేందుకు కేసిఆర్ నిన్న ప్రగతిభవన్ లో ప్రెస్ మీట్ పెట్టాడని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ఏఎన్ఐ, పి టి ఐ, సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిలను ఇందులోకి లాగడం వెనుక తాను జాతీయస్థాయిలో బిజెపికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నట్టు ప్రొజెక్టు చేసుకున్నాడు. ఒకవేళ మొయినాబాద్ ఎపిసోడ్లో కెసిఆర్ చెప్పినంత తీవ్రత కనుక ఉండి ఉంటే జాతీయస్థాయి మీడియా సంస్థలు ఎప్పుడో ఊదరగొట్టేవి. ఈ కేసులో మళ్లీ మళ్లీ అవే ప్రశ్నలు కేసీఆర్ వేస్తుండడంతో ఎంతకి జవాబులు దొరకడం లేదు. వాస్తవానికి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కెసిఆర్ పిలుపునిస్తున్నాడు.. అంతకంటే ముందే తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలను ఎలా చీల్చాడో అందరికీ తెలుసు. సుదీర్ఘమైన ప్రెస్ మీట్ నిర్వహించడం అభినందనీయమే కానీ.. పాడిందే పాట అనే సామెత తీరుగా… పదేపదే అదే విషయాలను చెప్పుకుంటూ పోతే చెప్పేవారికి లేకున్నా.. వినేవారికి ఇబ్బంది ఉంటుంది. అది కేసీఆర్ ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. ఇప్పుడు కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో రాణించాలి అనుకుంటున్నాడు. కానీ నిన్నే ఎన్నికల సంఘం గుజరాత్ రాష్ట్రంలో ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చింది. అక్కడ పోటీ చేసి.. గెలిస్తే కెసిఆర్ సత్తా ఆటోమేటిగ్గా తెలిసిపోతుంది. ఇంతోటి దానికి ఈ బిఆర్ఎస్, మొ యినాబాద్ ఫామ్ హౌస్ డీల్స్ అవసరమా? ఇప్పుడు ఈ ప్రశ్న అందరి మెదళ్ళలో మెదులుతోంది.