Economic Depression 2022: ఆర్థిక మాంద్యం పరిస్థితులు ప్రపంచాన్నే అతలాకుతలం చేస్తున్నాయి. సామాన్యుడి జీవనం ప్రశ్నార్థకంగా మారుతోంది. అందరు ఈఎంఐలు కట్టుకుంటూ బతుకు వెళ్లదీస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకవేళ ఉద్యోగం పోతే పరిస్థితి ఏంటి? మనం తీసుకునే జాగ్రత్తలు ఏంటి? అనే విషయాలపై నిపుణులు పలు కోణాల్లో చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. స్థూల ఆర్థిక అనిశ్చితిని దాటాలంటే మనం కూడా సన్నద్ధంగానే ఉండాల్సిన అవసరం ఏర్పడింది. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఇబ్బందులకు గురిచేస్తోంది. ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తోంది. కొన్ని నెలలుగా ద్రవ్యోల్బణం ఎన్నో కష్టాలకు కారణమవుతోంది. ఎంతో మంది ఉద్యోగాలు పోవడానికి పరోక్షంగా కారణమవుతోంది.

చేస్తున్న ఉద్యోగం ఒకవేళ కోల్పోతే గందరగోళ పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంది. దీంతో ఏం చేయాలో కూడా అర్థం కాదు. అనుకోని విపత్తులు ఎదురైతే కలిగే ఇబ్బందుల గురించి ముందే జాగ్రత్తలు తీసుకుంటే ఉద్యోగం పోయినా సమస్యలుండవు. మనం చేస్తున్న పని దూరం అయితే 3-6 నెలల ఖర్చులకు సరిపడే డబ్బును పొదుపు చేయాలి. జీతంలో కనీసం 25 శాతం వరకు రికరింగ్ డిపాజిట్ పథకంలో జమ చేసుకుంటే మంచిది. వేతనానికి మూడు రెట్లు పన్నెండు నెలల కాలంలో జమ చేసుకోవాలి.
ఆరు రెట్లు జమ చేస్తే 23 నెలలు పడుతుంది. పొదుపు ఖాతాలో దాచుకున్న సొమ్మును ఫిక్స్ డ్ డిపాజిట్ లోకి మార్చుకోవాలి. నిత్యావసరాలు, ఇంటి అద్దె, ఈఎంఐలు కట్టుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. ఆదాయం కోల్పోయినప్పుడు ఉన్న నిధులతో సర్దుకోవచ్చు. ఉద్యోగం కోల్పోతే క్రెడిట్ కార్డు వంటివి ఉపయోగించుకోకూడదు. ఆదాయం లేనప్పుడు కార్డు బిల్లులను సకాలంలో చెల్లించడం వీలు కాదు. అందుకే క్రెడిట్ కార్డులను వాడుకోవడం అంత మంచిది కాదు. ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తుంది.

ఖరీదైన వస్తువులు, భోజనాలకు దూరంగా ఉండాలి. కొన్ని కోరికలను త్యాగం చేయాలి. ఆరోగ్య బీమా రక్షణలో ఉన్న వారు సొంతంగా ఓ పాలసీ తీసుకోవాలి. ఉద్యోగం మానేసిన సందర్భంలో వచ్చే చిక్కులను ముందే గ్రహించుకుని జాగ్రత్తలు వహిస్తే సరిపోతుంది. అనుకోని సందర్భాల్లో అనారోగ్యం బారిన పడితే పొదుపు మొత్తం చికిత్స కోసం కేటాయించాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ఆదాయం కోల్పోతే ఒకేసారి పెట్టుబడులు వెనక్కి తీసుకోవద్దు. ప్రావిడెంట్ ఫండ్, ఈక్విటీల నుంచి పెట్టుబడులు వెనక్కి తీసుకుంటేనే ప్రయోజనం. ఇలా మనం ఉద్యోగం కోల్పోయిన సందర్భంలో మనకు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ముప్పు ఉండదని తెలుసుకోవాలి.