జేసీ ఫ్యామిలీని టీడీపీలో వెలివేస్తున్నారా?

బయట పార్టీల నుంచి వచ్చిన నేతలకు.. టీడీపీలో ఆది నుంచి ఉన్న వారికి మధ్య అస్సలు పడడం లేదు. ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి వచ్చి టీడీపీలో ఆధిపత్యం చెలాయిస్తున్న నేతలను టీడీపీ నేతలు సహించడం లేదు. చంద్రబాబు వారిని నెత్తిన పెట్టుకున్నా నియోజకవర్గాల్లో మాత్రం కాలు పెట్టనివ్వడం లేదు. తాజాగా అనంతపురం రాజకీయంలో జేసీ ఫ్యామిలీని టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు వెలివేసిన వైనం హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబు, లోకేష్ లు జేసీ […]

Written By: NARESH, Updated On : December 5, 2020 5:26 pm
Follow us on

బయట పార్టీల నుంచి వచ్చిన నేతలకు.. టీడీపీలో ఆది నుంచి ఉన్న వారికి మధ్య అస్సలు పడడం లేదు. ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి వచ్చి టీడీపీలో ఆధిపత్యం చెలాయిస్తున్న నేతలను టీడీపీ నేతలు సహించడం లేదు. చంద్రబాబు వారిని నెత్తిన పెట్టుకున్నా నియోజకవర్గాల్లో మాత్రం కాలు పెట్టనివ్వడం లేదు. తాజాగా అనంతపురం రాజకీయంలో జేసీ ఫ్యామిలీని టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు వెలివేసిన వైనం హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబు, లోకేష్ లు జేసీ ఫ్యామిలిని నెత్తిన పెట్టుకున్నా వారి వైపు కూడా తొంగి చూడడం లేదు మాజీ మంత్రులు , ఎమ్మెల్యేలు. పూర్తిగా జేసీ ఫ్యామిలీని రాజకీయంగా దూరం పెట్టేశారు. తాజాగా వార్నింగ్ లు కూడా ఇచ్చారు.

Also Read: బిజెపి గెలుపుపై కవిత వింత వాదన

తాజాగా అనంతపురం అర్బన్ టీడీపీ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి జేసీ ఫ్యామిలీకి హెచ్చరికలు పంపడం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ రెడ్డి తన నియోజకవర్గంలో వేలుపెట్టి నియంతలా వ్యవహరిస్తే సహించేది లేదని ప్రభాకర్ చౌదరి హెచ్చరించారు. అంతేకాదు.. సొంత పార్టీలో ఉన్న జేసీ దివాకర్ రెడ్డి వర్గంతో ప్రత్యక్ష పోరుకు సిద్ధమంటూ ప్రభాకర్ చౌదరి సవాల్ విసరడం రాజకీయంగా సంచలనమైంది..

జేసీ పవన్ పై ప్రభాకర్ చౌదరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘తాడిపత్రిలో టీడీపీని నాశనం చేశారని.. ఇప్పుడు అనంతపురంలో టీడీపీని నాశనం చేసేందుకు తిరుగుతున్నారని’ మండిపడ్డారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో జేసీ పవన్ రెడ్డి కార్యక్రమాలు చేపట్టడంతో ఈ వివాదాలు బయటపడ్డాయి. తన అనుమతి లేకుండా ఎందుకు పర్యటిస్తున్నారంటూ ప్రభాకర్ చౌదరి ఆగ్రహం వ్యక్తం చేయడం సంచలనమైంది. అంతేకాదు జేసీ పవన్ రెడ్డిని ఓ శకునిగా ప్రభాకర్ చౌదరి అభివర్ణించారు.

Also Read: బ్యాంకు లావాదేవీ ఫెయిలైందా.. అయితే రోజుకు 100 పొందే ఛాన్స్..?

అనంతపురం తెలుగుదేశం పార్టీలో వర్గపోరు తీవ్రమైంది. టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరిల మధ్య వివాదం ముదిరి పాకాన పడుతోంది. శరామామూలుగానే అనంత టీడీపీ వర్గపోరుపై చంద్రబాబు, లోకేష్ లు సైలెంట్ గా ఉన్నారు. తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండని మిన్నకున్నారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్