https://oktelugu.com/

కాంగ్రెస్ పై మరోసారి సంచలన కామెంట్స్ చేసిన ‘కొండా’..!

జీహెచ్ఎంసీ ఫలితాలపై కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ విశ్వశ్వర్ రెడ్డి నిన్న ట్వీట్ చేశారు. ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ ఢీకొట్టే సత్తా బీజేపీకే ఉందంటూ వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో విశ్వశ్వర్ రెడ్డి కాంగ్రెస్ కు హ్యండిచ్చి బీజేపీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగింది. Also Read: బిజెపి గెలుపుపై కవిత వింత వాదన ఈ ప్రచారం నేపథ్యంలో విశ్వేశ్వర్ రెడ్డి తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. తాను కాంగ్రెస్ లో కొనసాగుతానని బీజేపీలో […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 5, 2020 / 04:57 PM IST
    Follow us on

    జీహెచ్ఎంసీ ఫలితాలపై కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ విశ్వశ్వర్ రెడ్డి నిన్న ట్వీట్ చేశారు. ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ ఢీకొట్టే సత్తా బీజేపీకే ఉందంటూ వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో విశ్వశ్వర్ రెడ్డి కాంగ్రెస్ కు హ్యండిచ్చి బీజేపీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగింది.

    Also Read: బిజెపి గెలుపుపై కవిత వింత వాదన

    ఈ ప్రచారం నేపథ్యంలో విశ్వేశ్వర్ రెడ్డి తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. తాను కాంగ్రెస్ లో కొనసాగుతానని బీజేపీలో చేరడం లేదని స్పష్టం చేశారు. అయితే కాంగ్రెస్ పై ఉన్న అసహనాన్ని మాత్రం విశ్వేశ్వర్ రెడ్డి మరోసారి బయటపెట్టారు.

    కొందరు కాంగ్రెస్ నేతలు కేసీఆర్ తొత్తులుగా వ్యవహరిస్తున్నారనే అపవాదును మూటకట్టుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేకతను కూడగట్టడంలో కాంగ్రెస్ నేతలు విఫలమయ్యారని విమర్శించారు.

    కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ తో కలిస్తే మాత్రం బీజేపీలో చేరుతానని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతల మాటతీరు మారాల్సిన అవసరం ఉందన్నారు. టీఆర్ఎస్ నేతల మాటకు మాట అన్నట్లుగా వ్యవహరించాలని సూచించారు.

    Also Read: రేపే టీపీసీసీ ప్రకటన.. రేసులో ఇద్దరు నేతలు?

    కేసీఆర్ వద్ద చిన్న లాఠీ ఉంటే బీజేపీ వద్ద పెద్దలాఠి ఉందని నగర ప్రజలు గుర్తించారని.. అందుకే జీహెచ్ఎంసీలో బీజేపీకి నగరవాసులు అన్ని సీట్లు కట్టబెట్టారని తెలిపారు. కేసీఆర్‌కు పదునైన భాషతో బదులు చెప్పే నేతల అవసరం కాంగ్రెస్ కు  ఇప్పుడు అవసరం ఉందన్నారు.

    తాను కాంగ్రెస్ లోనే కొనసాగుతానని.. ఇక టీపీసీసీ ఎవరికీ ఇచ్చిన కాంగ్రెస్ నేతలంతా కలిసి పని చేయాలని సూచించారు. ఈమేరకు కాంగ్రెస్ నేతలంతా ఒక్కతాటిపైకి వచ్చాయని విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్