కేసీఆర్ కు జగన్ సపోర్టు చేస్తారా? చేయరా?

కేంద్రంలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక సందర్భంగా  రాజకీయం కొత్త మలుపు తిరుగుతుంది. ఒకప్పటి కాంగ్రెస్ సీనియర్ నేత , ప్రస్తుతం టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ అయిన కేకేను ఈ ఎన్నికల్లో పోటీ చేయించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ మేరకు రాజ్యసభలో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ గులాం నబీ ఆజాద్ స్వయంగా కేకేకు ఫోన్ చేసి మీరు నిలబడాలని కాంగ్రెస్ మద్దతు ఇస్తుందని ప్రతిపాదన పెట్టారు. Also Read: బీజేపీ ఆలోచననే జగన్‌ ఆచరణలో పెడుతున్నారా? […]

Written By: NARESH, Updated On : September 11, 2020 2:11 pm
Follow us on

కేంద్రంలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక సందర్భంగా  రాజకీయం కొత్త మలుపు తిరుగుతుంది. ఒకప్పటి కాంగ్రెస్ సీనియర్ నేత , ప్రస్తుతం టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ అయిన కేకేను ఈ ఎన్నికల్లో పోటీ చేయించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ మేరకు రాజ్యసభలో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ గులాం నబీ ఆజాద్ స్వయంగా కేకేకు ఫోన్ చేసి మీరు నిలబడాలని కాంగ్రెస్ మద్దతు ఇస్తుందని ప్రతిపాదన పెట్టారు.

Also Read: బీజేపీ ఆలోచననే జగన్‌ ఆచరణలో పెడుతున్నారా?

దీంతో కేకే వెంటనే  కేసీఆర్ నిర్ణయం ప్రకారం ముందుకు వెళుతానని అంటున్నాడు.  ఆయనకు ఈ ప్రతిపాదన గురించి తెలియజేశారు. కేసీఆర్ కనుక ఒప్పుకుంటే ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంటుంది. బీజేపీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్, తన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ తో కలిసినట్టు అవుతుంది. ఇదే దేశ రాజకీయాల్లో అనూహ్య మలుపుగా భావిస్తున్నారు. కేసీఆర్ ఏం చేస్తాడన్నది ఇక్కడ కీలకంగా మారింది. ఒకవేళ టీఆర్ఎస్ ఎంపీ పోటీలో ఉంటే పక్కరాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ మద్దతు ఎవరికి ఇస్తుందనేది ఆసక్తిగా మారింది. బహుశా టీఆర్ఎస్ కే వైసీపీ మద్దతునిచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఈ పరిణామాల్లో బీజేపీ-జేడీయూల ఉమ్మడి అభ్యర్థి గెలుపు కోసం ఏపీ సీఎం వైఎస్ జగన్ కు తాజాగా బీహార్ సీఎం నితీష్ కుమార్ నుంచి ఫోన్ వచ్చింది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు సంబంధించి ఫోన్ చేసినట్లు తెలిసింది. డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి హరివంశ్ నారాయణ్ సింగ్ కు మద్దతు పలకాల్సిందిగా నితీష్ సీఎం జగన్ ను ఫోన్ లైన్లో కోరారు.

2018లో కాంగ్రెస్ కు చెందిన బీకే హరిప్రసాద్ ను ఓడించి బీజేపీ అభ్యర్థి హరివంశ్ డిప్యూటీ చైర్మన్ గా ఎన్నికయ్యారు. ఈ ఏడాదితో ఆయన పదవీ కాలం ముగియనుండడంతో మరోసారి ఆయన పోటీలో నిలిచారు. హరివంశ్ కోసం బీహార్ సీఎం ఏపీ సీఎం జగన్ సాయం కోరారు.

Also Read: మోడీతో ఫైట్.. కేసీఆర్ నెగ్గుతారా?

సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 1వ తేది వరకు పార్లమెంట్ వర్షకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో తొలి రోజు డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరగనుంది. వైసీపీకి ఆరుగురు రాజ్యసభ ఎంపీల బలం ఉంది. దీంతో వైసీపీ కీలకంగా మారనుంది. వైసీపీ ప్రస్తుతం టీఆర్ఎస్ తో సాన్నిహిత్యంగా ఉంటోంది. మరి బీజేపీతోనూ అంటకాగుతుంది. వీరిద్దరూ బరిలో ఉంటే వైసీపీ ఎటువైపు మొగ్గుతుందనేది ఆసక్తిగా మారింది.