వైసీపీ మద్దతు కోసం బీజేపీ విన్నపాలు… జగన్ ఏం చేస్తారో…?

సాధారణంగా ఏ దేశంలోనైనా పలు సందర్భాల్లో ఒక పార్టీకి మరో పార్టీ సహకారం అవసరం. ఒంటరిగా విజయం సాధించలేమనుకునే పార్టీలు ప్రత్యర్థి పార్టీని దెబ్బ కొట్టడం కోసం మరో పార్టీ నుంచి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సహాయసహకారాలు తీసుకుంటూ ఉంటాయి. సమైక్యంగా ముందుకెళితే మాత్రమే పలు పనుల్లో విజయం సాధించడం సాధ్యమవుతుంది. ప్రస్తుతం రాజ్య‌స‌భ డిప్యూటీ చైర్మ‌న్ ఎన్నిక కోసం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ సహాయం కోరుతోంది. Also Read […]

Written By: Navya, Updated On : September 11, 2020 3:18 pm
Follow us on

సాధారణంగా ఏ దేశంలోనైనా పలు సందర్భాల్లో ఒక పార్టీకి మరో పార్టీ సహకారం అవసరం. ఒంటరిగా విజయం సాధించలేమనుకునే పార్టీలు ప్రత్యర్థి పార్టీని దెబ్బ కొట్టడం కోసం మరో పార్టీ నుంచి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సహాయసహకారాలు తీసుకుంటూ ఉంటాయి. సమైక్యంగా ముందుకెళితే మాత్రమే పలు పనుల్లో విజయం సాధించడం సాధ్యమవుతుంది. ప్రస్తుతం రాజ్య‌స‌భ డిప్యూటీ చైర్మ‌న్ ఎన్నిక కోసం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ సహాయం కోరుతోంది.

Also Read : చంద్రబాబు గారూ…. మీరు మాట్లాడేది మీకైనా అర్థమవుతుందా….?

2019 ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు నుంచి వైసీపీ కేంద్రానికి మద్దతు ఇస్తూనే ఉంది. ప్రతి సందర్భంలోనూ కేంద్రం తీసుకున్న నిర్ణయాలకు అనూకూలంగానే వైసీపీ వ్యాఖ్యలు చేస్తోంది. బీజేపీ పలు పార్టీలతో కలిసి ఏర్పాటు చేసిన ఎన్డీఏ కూటమి డిప్యూటీ చైర్మ‌న్ ఎన్నిక ఏకగ్రీవం కోసం బీజేపీ వైసీపీ సహాయం కోరుతోంది. రాజ్యసభలో బీజేపీకి పూర్తిస్థాయిలో బలం లేదనే సంగతి తెలిసిందే.

పూర్తిస్థాయిలో మద్దతు లేకపోవడం వల్ల బీజేపీ ఎన్డీఏ అభ్యర్థి విజయం కోసం ఇతర పార్టీలపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. జేడీయూకు చెందిన నేత‌ను ఎన్డీఏ డిప్యూటీ ఛైర్మన్ పదవి రేసులో నిలిచింది. బీహార్ సీఎం నితీష్ నుంచి సీఎం జగన్ కు మద్దతు విషయంలో కాల్ వచ్చిందని… పార్టీ నేతలను సంప్రదించి మద్దతు గురించి చెబుతానని జగన్ చెప్పినట్టు తెలుస్తోంది.

నిజానికి వేర్వేరు కారణాల వల్ల జగన్ కు కాంగ్రెస్ తో సఖ్యత లేదు. కాంగ్రెస్ తరపున నిలబెట్టిన అభ్యర్థికి వైసీపీ మద్దతు ఇవ్వడం ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. అందువల్ల డిప్యూటీ ఛైర్మన్ పదవి విషయంలో ఎన్డీఏ నిలబెట్టిన అభ్యర్థికే వైసీపీ మద్దతు ఇచ్చే అవకాశాలు ఐతే ఉన్నాయి.

Also Read : కేసీఆర్ కు జగన్ సపోర్టు చేస్తారా? చేయరా?