https://oktelugu.com/

జగన్ టార్గెట్ ఇప్పుడు అశోక్ గజపతేనా?

మాన్సాస్ ట్రస్టుపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా చైర్మన్ పై న్యాయపోరాటం చేసేందుకు సిద్ధమైంది. అశోక్ గజపతి రాజుపై విమర్శలు చేస్తూ జైలుకు పంపించాలని చూస్తోంది. ఈక్రమంలో విజయసాయిరెడ్డి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. మాన్సాస్ పై విచారించేందుకు ఆరు విచారణ కమిటీలను ఏర్పాటు చేసింది. దీంతో మాన్సాస్ కార్యకలాపాలను విడివిడిగా పరిశీలన చేస్తున్నాయి. ఎక్కడ పోగుట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలనే నానుడిని నిజం చేస్తూ అశోక్ గజపతిరాజును పదవీచ్యుతుడిని చేయాలి సంకల్పించి అందుకు అవసరమైన చర్యలు తీసుకోవడంలో జగన్ […]

Written By:
  • Srinivas
  • , Updated On : June 25, 2021 / 05:39 PM IST
    Follow us on

    మాన్సాస్ ట్రస్టుపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా చైర్మన్ పై న్యాయపోరాటం చేసేందుకు సిద్ధమైంది. అశోక్ గజపతి రాజుపై విమర్శలు చేస్తూ జైలుకు పంపించాలని చూస్తోంది. ఈక్రమంలో విజయసాయిరెడ్డి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. మాన్సాస్ పై విచారించేందుకు ఆరు విచారణ కమిటీలను ఏర్పాటు చేసింది. దీంతో మాన్సాస్ కార్యకలాపాలను విడివిడిగా పరిశీలన చేస్తున్నాయి.

    ఎక్కడ పోగుట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలనే నానుడిని నిజం చేస్తూ అశోక్ గజపతిరాజును పదవీచ్యుతుడిని చేయాలి సంకల్పించి అందుకు అవసరమైన చర్యలు తీసుకోవడంలో జగన్ సర్కారు సిద్ధమైంది. ప్రభుత్వం నియమించిన ఆరు కమిటీలు పనులు ప్రారంభించాయి. ఏ చిన్న పొరపాటు జరిగినా దాన్ని పెద్దగా చూపించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

    కొన్ని కమిటీలు ఇప్పటికే అప్పగించిన విభాగాల్లో చురుకుగా విచారణ ప్రారంభించాయి. ఒక వేళ పెద్దగా లోపాలు లేకపోయినా చిన్నలోపం దొరికినా దాన్ని స్కాంగా చూపి కేసులు పెట్టగల సత్తా ప్రభుత్వానికి ఉందనే విషయం తెలిసిందే. ఇలాగే టీడీపీ నేతలపై ఎన్నో కేసులు పెట్టిన వైనం విదితమే.

    ఎంత పెద్ద నేతనైనా ఏదో ఒక కేసు పెట్టి జైలుకు పంపి రెండు మూడు వారాలు బెయిల్ రాకుండా చేయడంలో వైసీపీ నేతలు సిద్ధహస్తులే. ఇప్పటికే అచ్చెన్నాయుడు, ధూళిపాళ్ల నరేంద్ర, కొల్లు రవీంద్ర లాంటి వారిని జైలుకు పంపిన సంగతి అందరికి తెలుసు. ప్రస్తుతం అశోక్ గజపతిరాజును సైతం ఇదే మాదిరిగా ఏదో సాకు చూపి జైలు పాలు చేయాలనే సంకల్పంతో ఉన్నట్లు తెలుస్తోంది.