‘కాంచన’ వంటి అరివీర మాస్ సినిమాలను మాత్రమే నటించే లారెన్స్ కు, ‘అసురన్’, ‘విసరణై’, ‘ఆడుకాలం’ వంటి అవార్డు విన్నింగ్ సినిమాలు తీసిన మేకర్ వెట్రి మారన్ కు సింక్ అవుతుందా ? లారెన్స్ కి వెట్రిమారన్ కథ చాలా బాగా నచ్చిందట. వెట్రిమారన్ తనే కథ, స్క్రీన్ ప్లే రాసి నిర్మిస్తున్న సినిమా కాబట్టి, ఈ సినిమా పై ప్రత్యేక కేర్ తీసుకుంటున్నాడు.
లారెన్స్ కూడా హీరోగా నటిస్తున్నాడు కాబట్టి, ఈ స్క్రిప్ట్ లో లారెన్స్ బాగా ఇన్ వాల్వ్ అవుతున్నాడు. ఇక ఈ సినిమా టైటిల్ “అధిగారం” అని పెట్టారు. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ ను తాజాగా విడుదల చేశారు. అన్నట్టు ఈ సినిమాని దురై సెంథిల్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు. స్క్రిప్ట్ చాలా బాగుంది, ఇది నాకు కొత్త ఇమేజ్ ని తెస్తుంది అంటూ లారెన్స్ కూడా నమ్మకంగా చెబుతున్నాడు.
ఇక లారెన్స్ గతేడాది హిందీలో ‘కాంచన’ సినిమాని రీమేక్ చేసి విడుదల చేస్తే భారీ ప్లాప్ అయింది. లారెన్స్ కెరీర్ లోనే ఘోరమైన కామెంట్స్ వచ్చింది కూడా ఆ సినిమాకే. పరమ చెత్త సినిమాల్లో ఈ సినిమా మొదటి ర్యాంక్ అందుకుంటుంది అంటూ లారెన్స్ పై విమర్శకులు దారుణమైన కామెంట్స్ చేశారు. అందుకే లారెన్స్ డైరెక్షన్ మాని హీరోగా మళ్ళీ సినిమాలు చేయాలనే ఆలోచనలో ఉన్నాడు.