https://oktelugu.com/

థియేటర్ వ్యవస్థను దెబ్బ తీయడమే జగన్ లక్ష్యమా?

ఆంధ్రప్రదేశ్ లో సినిమా థియేటర్ల మీద సీఎం జగన్ పగబూనినట్లున్నారు. టికెట్ల రేట్లు భారీగా తగ్గించేలా జగన్ తీసుకున్న నిర్ణయంపై ప్రజల్లో కూడా సానుకూలత రావడం లేదు. దీంతో సినీ పరిశ్రమ నుంచి మాత్రం తీవ్ర వ్యతిరేకత వస్తోంది. జగన్ సినీ పరిశ్రమ మీద పగ తీర్చుకునేందుకు చూస్తున్నట్లు తెలుస్తోంది. జగన్ నిర్ణయం వల్ల థియేటర్ వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది. థియేటర్ వ్యవస్థ నడపడం కష్టపూరితం. పైగా ఇప్పుడు అంత లాభసాటి కాని వ్యవహారం అయిందన్న […]

Written By:
  • Srinivas
  • , Updated On : July 12, 2021 / 09:30 AM IST
    Follow us on

    ఆంధ్రప్రదేశ్ లో సినిమా థియేటర్ల మీద సీఎం జగన్ పగబూనినట్లున్నారు. టికెట్ల రేట్లు భారీగా తగ్గించేలా జగన్ తీసుకున్న నిర్ణయంపై ప్రజల్లో కూడా సానుకూలత రావడం లేదు. దీంతో సినీ పరిశ్రమ నుంచి మాత్రం తీవ్ర వ్యతిరేకత వస్తోంది. జగన్ సినీ పరిశ్రమ మీద పగ తీర్చుకునేందుకు చూస్తున్నట్లు తెలుస్తోంది. జగన్ నిర్ణయం వల్ల థియేటర్ వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది.

    థియేటర్ వ్యవస్థ నడపడం కష్టపూరితం. పైగా ఇప్పుడు అంత లాభసాటి కాని వ్యవహారం అయిందన్న మాట నిజమే. ఆంధ్రప్రదేశ్ లోని టౌన్ లలో ప్రధాన థియేటర్లు కల్యాణ మండపాలు, షాపింగ్ కాంప్లెక్స్ లుగా మారిపోతున్నాయి. ఇప్పటికే ఓటీటీ, డీటీహెచ్ తదితర సమస్యలతో బాధపడుతున్న ఎగ్జిబిటర్ల వ్యవస్థపై జగన్ తీసుకున్న నిర్ణయం పిడుగుపాటుగా మారింది. టికెట్ల రేట్లు భారీగా తగ్గించడం వల్ల నష్టం కలిగే అవకాశాలున్నాయి. టికెట్ల రేట్లు ఎప్పుడు పడితే అప్పుడు పెంచుకునేలా చేయడంతో ఎగ్జిబిటర్లకు మింగుడుపడడం లేదు.

    వినోదం ఇవాళ నిత్యావసర వస్తువు అయిపోయింది. సినిమా టికెట్ల రేట్లు తగ్గిస్తే ప్రజల నుంచి సానుకూలత రావాలి కానీ ఆశ్చర్యంగా ప్రజల్లో కూడా సానుకూలత రావడం లేదు.దేశంలో ఎన్నో రేట్లు పెరుగుతున్నా టికెట్ల రేట్లు తగ్గించడం కక్ష్యపూరితమే అని తెలుస్తోంది. తగ్గించాలంటే పెట్రోల్ వంటి వాటిపై పన్నులను తగ్గించాలని సూచించారు.

    సినిమా టికెట్ల రేట్లు ఏ మేరకుఉండవచ్చు అన్న అంశాన్ని స్టడీ చేయడానికి ఒక కమిటీ వేయడం, అది ఇచ్చే నివేదిక మేరకు టికెట్ల రేట్లు నిర్ధారించేందుకు బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, తమిళ స్టార్ సూర్య సహా అనేక మంది హీరోలు తమ సినిమాలకు ఓటీటీలో విడుదల చేయడానికి వెనుకాడడం లేదు. హీరోలను లక్ష్యంగా చేసుకుని థియేటర్ వ్యవస్థను దెబ్బతీస్తే దాని ద్వారా హీరోల కంటే ఎక్కువగా ఎగ్జిబిటర్లు, థియేటర్ యజమానులు దెబ్బతింటారనే విషయం తెలుస్తోంది ఈ నేపథ్యంలో థియేటర్ వ్యవస్థను జగన్ బతికిస్తారా? లేక సొంత భారతి సిమెంట్ రేట్లు, నిత్యావసర వస్తువులరేట్లు ఎంత పెంచినా థియేటర్ రేట్లు మాత్రం పెంచకుండా చేయడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు.