
మనలో కోటీశ్వరులు కావాలని భావించే వాళ్లు చాలామంది ఉంటారు. కరోనా కాలం కావడంతో ఎవరి ఉద్యోగం ఎప్పుడు పోతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి సమయంలో తక్కువ పెట్టుబడితో అధిక రాబడి వచ్చే పథకాలలో పొదుపు చేసిన డబ్బులను డిపాజిట్ చేస్తే మంచిది. ఇలా చేయడం ద్వారా దీర్ఘకాలంలో మంచి లాభాలను కచ్చితంగా పొందే అవకాశాలు అయితే ఉంటాయి. 30 సంవత్సరాలలో కోటీశ్వరులు కావాలనుకునే వాళ్లకు పీపీఎఫ్ స్కీమ్ బెస్ట్ స్కీమ్ అని చెప్పవచ్చు.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా చిన్న చిన్న పొదుపులను లాభదాయకమైన పెట్టుబడిగా సులువుగా మార్చుకోవచ్చు. నేషనల్ సేవింగ్స్ ఆర్గనైజేషన్ ఈ స్కీమ్ ను ప్రవేశపెట్టింది. దీర్ఘకాలిక పీపీఎఫ్ చాలా మంచి రాబడిని ఇస్తుందనే విషయాన్ని కచ్చితంగా గుర్తుంచుకోవాలి. మెచ్యూరిటీ కాలాన్ని తెలివిగా ఎంచుకోవడం ద్వారా మంచి రాబడిని పొందే అవకాశం అయితే ఉంటుంది.
సంవత్సరానికి పీపీఎఫ్ ఖాతాలో గరిష్ఠంగా 12 డిపాజిట్లు చేసే అవకాశం ఉండగా ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేయలేని వాళ్లు నెలకు ఒకసారి ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదని చెప్పవచ్చు. ఈ విధంగా ఖాతాదారుడు సులభంగా నెల వడ్డీని పొందే అవకాశం ఉంటుంది. నెలకు ఈ స్కీమ్ లో 9,000 రూపాయల చొప్పున 30 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేస్తే 30 ఏళ్లకు కోటి రూపాయల కంటే ఎక్కువ మొత్తం పొందే అవకాశం ఉంటుంది.
ఈ స్కీమ్ లో చేరడం వల్ల పన్ను మినహాయింపు ప్రయోజనాలను కూడా పొందే అవకాశం అయితే ఉంటుంది. ఈ స్కీమ్ లో దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుందని గుర్తు పెట్టుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ స్కీమ్ వడ్డీ రేట్లలో మార్పులు చేస్తుంది.