Ganga River floating stone: గంగానదిని మన దేశ ప్రజలు దేవతగా పూజిస్తుంటారు. గంగా నదిలో స్నానం చేయడానికి పూర్వజన్మ సుకృతంగా భావిస్తుంటారు. ఉత్తర్ ప్రదేశ్ లోని కాశీ ప్రాంతంలో ఉన్న గంగా నదిలో స్నానం చేస్తే పాపాలు మొత్తం తొలగిపోతాయని నమ్ముతుంటారు. పండుగల సమయంలో గంగా నది కిటకిటలాడుతూ ఉంటుంది.. గంగా నది పరివాహకంలో ఇసుక వేస్తే రాలనంత జన సమూహం కనిపిస్తుంటుంది.
గంగా నదికి మనదేశంలో విశేషమైన ప్రాశస్త్యం ఉంది. పురాణాల నుంచి మొదలు పెడితే నేటి నవీన కాలం వరకు కూడా గంగానది భారతీయ చారిత్రక ఐతిహ్యంగా వెలుగొందుతోంది. కాలుష్యం తారస్థాయిలో ఉన్నా.. ఇతర వ్యర్ధాలు కలుస్తూ ఉన్నా.. గంగా నది ఇప్పటికీ ఒక ఐకానికి సింబల్ లాగానే ఉంది. గంగా నది ప్రక్షాళన కోసం కేంద్రం అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో కొంతమేర సఫలీకృతం కూడా అయింది. అయితే గంగా నదికి మహత్తర శక్తి ఉందని పురాణాలలో పండితులు పేర్కొన్నారు. నేటి నవీన కాలంలోనూ ఆసక్తి ఉందని మరోసారి నిరూపితమైంది.
గంగానది ఎక్కువగా ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ప్రవహిస్తుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘాజీపూర్ లో గంగా నదికి విపరీతమైన పరివాహకం ఉంటుంది. ఈ నది చుట్టూ పుణ్యక్షేత్రాలు ఏర్పడ్డాయి. ఇవన్నీ కూడా శివాలయాలు కావడం గమనార్హం. కాశి విశ్వేశ్వర స్వామిని దర్శించుకున్న వారంతా ఈ ఆలయాలకు వస్తుంటారు. ఈ ఆలయాలలో కొలువై ఉన్న శివుడిని పూజిస్తుంటారు.
ఉత్తర ప్రదేశ్ లోని ఘాజీపూర్ లో గంగానది ప్రవహిస్తుంది అని చెప్పుకున్నాం కదా. అయితే ఈ నదిలో ఒక రాయి తేలుతోంది. ఈ వీడియో ప్రస్తుతం వివిధ మాధ్యమాలలో తెగ సందడి చేస్తోంది. ఆ రాయికి కొంతమంది తాళ్లు కట్టి ఒడ్డుకు తీసుకొచ్చారు. దానికి పూజలు కూడా చేశారు. ఆ రాయి దాదాపు మూడు క్వింటాళ్ల వరకు బరువు ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. అంత బరువు ఉన్నప్పటికీ అది నీటిలో మునగడం లేదని.. ఇది ముమ్మాటికి గంగ మహత్యం అని స్థానికులు అంటున్నారు.. రాముడు సీతాదేవిని తీసుకురావడానికి సముద్రం మధ్యలో రామసేతు నిర్మించాడు. ఆ సమయంలో ఆ రాళ్లు నీటిలో మునగ లేదు. ఇప్పటికీ ఆ రాళ్ల ఆనవాళ్లు కనిపిస్తూనే ఉన్నాయి. సరిగ్గా కొన్ని దశాబ్దల క్రితం నాసా ఉపగ్రహం నుంచి తీసిన చిత్రాలలో రామసేతు స్పష్టంగా కనిపించింది. ఆ రామసేతు నిర్మాణానికి వాడిన రాళ్లకు.. గంగా నదిలో తేలియాడుతున్న రాయికి ఏదైనా సంబంధం ఉందేమోనని చరిత్రకారులు భావిస్తున్నారు.” ఆ రాయి పెద్దగా కనిపిస్తోంది. దాదాపు 3 క్వింటాళ్ల వరకు బరువు ఉంటుంది. అయినప్పటికీ అది నీటి మీద తేలియాడుతోంది. సాధారణంగా ఒక చిన్న గులకరాయిని నీటిలో వేస్తేనే వెంటనే మునుగుతుంది. కానీ ఈ రాయి అంత బరువు ఉన్నప్పటికీ మునగడం లేదు.. దాని వెనుక పరిశోధన జరగాల్సిన అవసరం ఉంది. పైగా నీటిలో అది తేలియాడుతూ ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. రామసేతు నిర్మాణానికి వాడిన రాయి.. ఈ రాయి ఒకటేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఒకవేళ అదే రాయి అయితే మాత్రం కచ్చితంగా ఈ ప్రాంతంలో అటువంటి నిర్మాణాలు ఏమైనా ఉన్నాయేమోనని పరిశీలించాల్సి ఉంటుందని” చరిత్రకారులు అంటున్నారు.