C: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) నటించిన ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియో ని విడుదల చెయ్యమని అభిమానులు చాలా రోజుల నుండి మేకర్స్ ని కోరుకుంటూ ఉన్నారు. మేకర్స్ 18 వ తేదీన విడుదల చేస్తామని ఒక సరికొత్త పోస్టర్ ద్వారా తెలిపారు. కానీ వాయిదా వేశారు. దీంతో అభిమానుల ఆగ్రహం ఆకాశాన్ని అంటింది. నిన్న యుద్ధ ప్రాతిపదికన కొన్ని మార్పులు చేర్పులు చేసి మేకింగ్ వీడియో ని సాయంత్రం వదిలారు. ఈ మేకింగ్ వీడియో కి ఫ్యాన్స్ నుండే కాదు, ఆడియన్స్ నుండి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ సాంగ్ ‘పులి ని తినే బెబ్బులి వచ్చేరో’ అనే పాట ప్రత్యేకంగా ఆకర్షించింది. పవన్ కళ్యాణ్ ఈ మేకింగ్ వీడియో లో అదిరిపోయాడు.
ఆయన లుక్స్ వింటేజ్ రోజుల ఫీలింగ్ ని అభిమానుల్లో తీసుకొచ్చింది. అంతే కాదు, ఈ సినిమా కోసం ఆయన చేసిన ఫైట్ రిహార్సల్స్ కి సంబంధించిన షాట్స్ ని కూడా ఈ మేకింగ్ వీడియో లో పెట్టారు మేకర్స్. అవి చూసేందుకు ఎంతో బాగున్నాయి, పవన్ కళ్యాణ్ నుండి ఈ స్థాయి ఫైట్స్ ఉంటాయని అభిమానులు అసలు ఊహించలేకపోయారు. ఏ సినిమాకు పదంతా కష్టం ఈ చిత్రం కోసం పవన్ కళ్యాణ్ పడ్డాడు. ఈ మూవీ సెట్స్ లో పవన్ కళ్యాణ్ అత్యంత ఆప్త మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా తిరుగుతూ కనిపించడం ప్రత్యేక ఆకర్షణ గా నిల్చింది. ఓవరాల్ గా మేకింగ్ వీడియో ఊహించిన దానికంటే బాగా ఉండడం తో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలకు సంబంధించిన మేకింగ్ ని కూడా ఇందులో మనం చూడొచ్చు. ఇకపోతే మేకింగ్ వీడియో లో ఉన్నటువంటి బిట్ సాంగ్స్ తరహాలో సినిమాలో చాలానే ఉన్నాయి.
కీలకమైన యాక్షన్ సన్నివేశాల్లో క్రిష్ మార్క్ బిట్ సాంగ్స్ చాలా ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా ట్రైలర్ లో చూపించిన ‘ఎవరది ఎవరది..అతగాడు ఒక పొదుపు కథ’ అంటూ వచ్చే పాట బాగా వైరల్ అయ్యింది. అంతే కాకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఒక ఎమోషనల్ సాంగ్ ని కూడా విడుదల చేయబోతున్నారట మేకర్స్. ఈ పాట బాహుబలి లోని నిప్పులే శ్వాసగా తరహాలో ఉంటుందని అంటున్నారు. సినిమాలో ఇంకా ఇలా ఎన్నో సర్ప్రైజ్ లు ఉన్నాయని, ఫ్యాన్స్ ఈ చిత్రాన్ని చూసిన తర్వాత గర్వంగా కాలర్ ఎగరేసుకుంటారని అంటున్నారు. మరి అది ఎంత వరకు నిజం అవుతుందో తెలియాలంటే మరో నాలుగు రోజులు ఆగాల్సిందే.
