ఎస్‌ఈసీపై సభా హక్కుల ఉల్కంఘన చర్యలు సాధ్యమేనా..?

ఏపీలో ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి మధ్య వివాదం మరింత ముదురుతోంది. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను ఎలాగైనా నియంత్రించాలనుకుంటున్న ప్రభుత్వం కొత్తగా ఆలోచించింది. శాసనసభ హక్కుల ఉల్లంఘన నోటీసులు జారీ చేసింది. ప్రజాప్రతినిధుల పట్ల ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆరోపిస్తూ ఈ నోటీసులు జారీ చేసింది. దీనిపై ఇప్పటికే సభా కమిటీ చర్చించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ)పై సభా హక్కుల ఉల్లంఘన చర్యలు సాధ్యమా? ఆ దిశగా అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. ప్రివిలేజ్ కమిటీ […]

Written By: Srinivas, Updated On : February 3, 2021 12:29 pm
Follow us on


ఏపీలో ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి మధ్య వివాదం మరింత ముదురుతోంది. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను ఎలాగైనా నియంత్రించాలనుకుంటున్న ప్రభుత్వం కొత్తగా ఆలోచించింది. శాసనసభ హక్కుల ఉల్లంఘన నోటీసులు జారీ చేసింది. ప్రజాప్రతినిధుల పట్ల ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆరోపిస్తూ ఈ నోటీసులు జారీ చేసింది. దీనిపై ఇప్పటికే సభా కమిటీ చర్చించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ)పై సభా హక్కుల ఉల్లంఘన చర్యలు సాధ్యమా? ఆ దిశగా అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. ప్రివిలేజ్ కమిటీ చేస్తున్న ప్రయత్నాలు ముందుకు సాగినా.. అంతిమంగా ఏం జరుగుతుంది? అసలు ప్రివిలేజ్ మోషన్ ఎవరికి వర్తిస్తాయి? వంటి పలు ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

Also Read: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్

ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్ తమను అవమానించారంటూ..మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభా హక్కుల ఉల్లంఘన కింద ఎస్ఈసీపై చర్యలు తీసుకోవాలంటూ.. వారు స్పీకర్‌‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రివిలేజ్ కమిటీ.. వర్చువల్ ద్వారా భేటీ అయి.. దీనిపై చర్చించింది. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి.

సభాహక్కుల ఉల్లంఘన అనేది శాసనసభ్యులకు మాత్రమే వర్తిస్తుందని తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 194 ప్రివిలేజేస్ అండ్ ఇమ్యూనిటీ కింద శాసనసభ్యులు స్వేచ్ఛగా మాట్లాడటంతోపాటు స్వతంత్రంగా ఓటు వేసే హక్కు కల్పిస్తోంది. ఆ ఆర్టికల్ ప్రకారం ఎమ్మెల్యేల హక్కును ఎవరూ తప్పుపట్టేందుకు అవకాశం లేదు. కోర్టులకు కూడా సమీక్షించే అధికారం లేదు. అయితే.. మంత్రి అనేది ఒక పొలిటికల్ పోస్ట్ మాత్రమే. ప్రభుత్వంలో ఒక భాగం. ఈ క్రమంలో రాజ్యాంగబద్ధ సంస్థ అయిన.. ఎలక్షన్ కమిషన్ పై విచ్చలవిడిగా రాజకీయ విమర్శలు చేసే అధికారం మంత్రులకు ఉండదు.

Also Read: మోడీ ఫెయిల్ అయ్యేది.. కేసీఆర్, జగన్ లు హిట్ అయ్యింది అక్కడే?

ప్రస్తుత వివాదంలో మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స ఇద్దరూ కూడా ఎస్ఈసీపై బహిరంగ వేదికలపై విమర్శలు గుప్పించారు. ఆయనకు టీడీపీకి మధ్య సంబంధం ఉందని పేర్కొన్నారు. అంతేకాదు.. పెద్దిరెడ్డి ఏకంగా తన ఇంట్లో గొడ్లు నయం అంటూ.. నిమ్మగడ్డపై విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఎస్ఈసీ వారిపై చర్యలు కోరుతూ గవర్నర్‌‌కు ఫిర్యాదు చేశారు. అయితే.. దీనిని తప్పుపడుతూ ఎస్ఈసీపై చర్యలు తీసుకోవాలంటూ ఇద్దరు మంత్రులు ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఇక గతంలో జరిగిన పరిణామాలను గమనిస్తే.. 1983లో ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో శాసనమండలిలో ఈనాడు రామోజీరావుపై రోశయ్య ప్రివిలైజ్ మోషన్ మూవ్ చేశారు. చివరకు హైకోర్టు స్టే ఇవ్వగా సుప్రీం కోర్టు కూడా సమర్థించింది. మరి మంత్రులు కూడా ఈ విషయంలో ఏం చేయబోతున్నారో చూడాలి.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్