https://oktelugu.com/

సీడాక్ సంస్థలో పరీక్ష లేకుండా ఉద్యోగాలు.. అర్హులు ఎవరంటే..?

సెంట‌ర్ ఫ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ ఉద్యోగాల కోసం వెతుకుతున్న అభ్యర్థులకు శుభవార్త చెప్పింది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఈ సంస్థ 100 ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. సీడాక్ నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రాజెక్ట్ టెక్నీషియన్, ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీ జరగనుంది. https://www.cdac.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. Also Read: ఏపీ ఇంటర్ విద్యార్థులకు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 3, 2021 / 12:37 PM IST
    Follow us on

    Jobs arrow

    సెంట‌ర్ ఫ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ ఉద్యోగాల కోసం వెతుకుతున్న అభ్యర్థులకు శుభవార్త చెప్పింది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఈ సంస్థ 100 ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. సీడాక్ నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రాజెక్ట్ టెక్నీషియన్, ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీ జరగనుంది. https://www.cdac.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

    Also Read: ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. పరీక్షలు ఎప్పుడంటే..?

    ఇప్పటికే ఈ ఉద్యోగాల భర్తీ కొరకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా ఫిబ్రవరి 15వ తేదీ దరఖాస్తులకు చివరి తేదీగా ఉంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు కేవలం ఇంటర్వ్యూ ద్వారానే ఎంపిక ప్రక్రియ చేకూరుతుంది. ఎలాంటి రాతపరీక్షను నిర్వహించకుండానే సీడాక్ సంస్థ ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తుండటం గమనార్హం.

    Also Read: ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. హెచ్‌సీఎల్ లో 1000 ఐటీ ఉద్యోగాలు..?

    ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ముంబైలో పని చేయాల్సి ఉంటుంది. సీడాక్ సంస్థ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనుంది. మొత్తం 100 ఉద్యోగ ఖాళీలలో ప్రాజెక్ట్ ఇంజినీర్ ఉద్యోగ ఖాళీలు 80 ఉండగా ప్రాజెక్ట్ టెక్నీషియ‌న్‌ ఉద్యోగ ఖాళీలు 20 ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు బీఈ, బీటెక్, ఎంసీఏ పూర్తి చేసి ఏడాది అనుభవం ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు.

    మరిన్ని వార్తలు కోసం: విద్య / ఉద్యోగాలు

    ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న సమయంలో ఈ మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ వివరాలను తప్పనిసరిగా ఇవ్వాలి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులలో ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వారు మాత్రమే ఈ ఉద్యోగాలకు ఎంపికయ్యే అవకాశాలు ఉంటాయి.