https://oktelugu.com/

ఈటల మాటల తూటాలు..: ఏదో తెలియని అసంతృప్తి

తెలంగాణ రాష్ట్ర సమితిలో సీనియర్‌‌ లీడర్‌‌ ఈటల రాజేందర్‌‌. ప్రస్తుతం వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. అయితే.. మరికొద్ది రోజుల్లో తెలంగాణలో నాయకత్వ మార్పు తథ్యం అని వినిపిస్తున్న తరుణంలో ఈటల రాజేందర్‌‌ ఈ మధ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి కేటీఆర్ చేతుల్లోకి వెళుతుందన్న ప్రచారం జోరుగా సాగుతున్న వేళ.. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అంతేకాదు.. టీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్‌‌పై అజమాయిషీ చేసే అధికారం తనకు […]

Written By:
  • Srinivas
  • , Updated On : February 3, 2021 / 12:14 PM IST
    Follow us on


    తెలంగాణ రాష్ట్ర సమితిలో సీనియర్‌‌ లీడర్‌‌ ఈటల రాజేందర్‌‌. ప్రస్తుతం వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. అయితే.. మరికొద్ది రోజుల్లో తెలంగాణలో నాయకత్వ మార్పు తథ్యం అని వినిపిస్తున్న తరుణంలో ఈటల రాజేందర్‌‌ ఈ మధ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి కేటీఆర్ చేతుల్లోకి వెళుతుందన్న ప్రచారం జోరుగా సాగుతున్న వేళ.. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అంతేకాదు.. టీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్‌‌పై అజమాయిషీ చేసే అధికారం తనకు ఉందన్న ధీమాను వ్యక్తం చేశారు.

    Also Read: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్

    కరీంనగర్ జిల్లాలోని వావిలాల గ్రామంలో రైతు వేదికను ప్రారంభించిన ఈటల భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌‌తో తనకు 20 ఏళ్ల అనుబంధం ఉందన్న ఈటల.. ‘ఇన్నేళ్ల అనుబంధంలో నాకు కేసీఆర్‌‌పై అజమాయిషీ ఉంది. రైతులు ఏమనుకుంటున్నారో చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది. ఆరేళ్ల కాలంలో కేసీఆర్ అనేక సమావేశాల్ని నిర్వహించింది కేవలం వ్యవసాయం మీద మాత్రమే’ అని గుర్తు చేశారు.

    పార్టీలు ఉండకపోవచ్చు.. జెండాలు ఉండకపోవచ్చు.. ప్రజల పక్షాన ఎప్పుడూ తాను ఉంటానన్న ఆయన..‘ఆరుసార్లు మీ బిడ్డగా ఆదరించి గెలిపించారు. మీ గౌరవాన్ని పెంచే దిశగా అడుగులు వేస్తాను. వ్యవసాయం.. నీళ్ల మీద అనేకసార్లు కేసీఆర్ మీటింగ్ పెట్టారు. తెలంగాణ జయించింది విద్యుత్ కోతలను మాత్రమేనని అందరూ గుర్తు పెట్టుకోవాలి’ అని చెప్పారు.

    Also Read: మోడీ ఫెయిల్ అయ్యేది.. కేసీఆర్, జగన్ లు హిట్ అయ్యింది అక్కడే?

    సీఎం కేసీఆర్ మనస్తత్వం తనకు తెలుసని.. వ్యవసాయ రంగంలో తెలంగాణ నంబర్ వన్‌గా ఉండాలన్నది ఆయన కోరికగా చెప్పారు. ఈ రోజున కేసీఆర్ ఉన్నా లేకున్నా.. తాను మంత్రిగా ఉన్నా లేకున్నా రైతులకు అండగా ఉంటామన్నారు. దేశం మొత్తానికి అన్నం పెట్టే సత్తా తెలంగాణకు ఉందని.. రాష్ట్రాలన్నీ నేడు తెలంగాణ వైపు చూస్తున్నాయన్నారు. దేశానికి వెన్నుముకగా ఉన్న రైతులకు ప్రభుత్వం ఎప్పటికీ అండగా ఉంటుందన్నారు. కేసీఆర్ మీద అజమాయిషీ.. పదవి ఉన్నా లేకున్నా లాంటి మాటలు ఈటల నోటి నుంచి రావటం ఆసక్తికరంగా మారాయి. ఈటల మాటలతో కేటీఆర్ సొంత టీంతో ముందుకు వెళ్లనున్నారా? అన్న కొత్త చర్చ నడుస్తోంది. మరోవైపు ఈటల వ్యాఖ్యలను పరిశీలనగా చూస్తే.. కేటీఆర్‌‌ సీఎం అయ్యాక ఆ కేబినెట్‌లో ఈటలకు స్థానం దొరుకుతుందా లేదా అనే ఆసక్తికర అంశం కూడా ఇప్పుడు తెరమీదకు వచ్చింది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్