మనిషి దైనందిన జీవితంలో రిలాక్స్ అయ్యేందుకు వినోదం తప్పనిసరి. పాతకాలంలో పద్యాలు..జానపద నాటకాలు.. సినిమాలు చూసి ప్రజలంతా వినోదాన్ని పొందేవారు. వీటిల్లో ఎక్కడా కూడా అశ్లీత లేకుండా జాగ్రత్త పడేవారు. అయితే రానురాను టెక్నాలజీ మారిపోతుండటంతో అశ్లీలత కంటెంట్ పెరిగిపోయింది. వీటిని అడ్డుకోవాల్సిన ప్రభుత్వాలు మిన్నకుండిపోవడం శోచనీయంగా మారింది.
Also Read: స్టార్ హీరోల సినిమాలు పండుగకేనట.. కానీ చిన్న ట్వీస్ట్..!
సినిమాల్లో అశ్లీలతను అడ్డుకునేందుకు ప్రత్యేకంగా సెన్సార్ బోర్డు పని చేస్తుంది. ముందుగా సెన్సార్ సభ్యులు సినిమాను చూసి ఇందులోని అభ్యంతరకర సన్నివేశాలను తొలగించి అందుకనుగుణంగా సర్టిఫికెట్స్ ఇస్తుంటారు. సెన్సార్స్ బోర్డు అనేది సినిమాలకే పరిమితమైంది. కాగా టీవీల్లోనూ.. ఓటీటీ సినిమాలు.. వెబ్ సీరిసుల్లో పెరిగిపోతున్న అశ్లీలతకు అడ్డుకోవడానికి ప్రత్యేక వ్యవస్థ లేకపోవడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
పిల్లలు.. పెద్దలు అందరూ కలిసి చూసే టీవీ, ఓటీటీల్లో అశ్లీలతను అడ్డుకోవాలని పలువురు న్యాయస్థానాల్లో ప్రజాప్రయోజన వ్యాఖ్యం దాఖలు చేశారు. దీనిపై సుప్రీం కోర్టు స్పందిస్తూ ఓటీటీ.. టీవీల్లో అశ్లీలత కట్టడికి కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చెప్పాలని కోరింది. దీంతో ఇన్నిరోజులు అశ్లీలతపై చూసిచూడనట్లు ఉన్న కేంద్రం ఒక్కసారిగా రంగంలోకి దిగింది.
ఓటీటీ.. యూట్యూబ్ ఛానళ్లను కేంద్ర సమాచార పరిధిలోకి తీసుకొస్తూ కేంద్రం తాజాగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయగా రాష్ట్రపతి ఆమోదించారు. గత అక్టోబర్లో కేంద్రం నెట్ ఫిక్స్.. హాట్ స్టార్ వంటి సంస్థలు స్వీయనియంత్రణ పాటించాలని సూచించింది. ఓటీటీలపై పదేపదే ఫిర్యాదు వస్తుండటంతో కేంద్రం ఆ సంస్థలను సమాచార శాఖ పరిధిలోకి తీసుకొచ్చింది. దీంతో ఇకపై ఓటీటీలు గీత దాటకుండా ఉండే అవకాశం ఉంటుంది.
Also Read: ‘ఆర్ఆర్ఆర్’కు అదనపు హంగులు అందుతున్న జక్కన్న.!
ఆస్ట్రేలియా.. ఇండోనేషియా.. టర్కీ.. సౌదీ.. అరేబీయా దేశాల్లోనూ ఓటీటీల ప్రసారాలను ఆయా ప్రభుత్వాలు నియంత్రిస్తుంటాయి. తాజాగా భారత్ లోనూ ఓటీటీల ప్రసారాలు సమాచార శాఖ పరిధిలోకి రానున్నాయి. దీంతో అశ్లీలతను కట్టడి చేయడం సులువుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంటర్నెట్లో కావాల్సిన అశ్లీల లభ్యమవుతుండగా ఓటీటీల్లో మాత్రం సెన్సార్ ఎందుకని పలువురు ప్రశ్నిస్తుండటం గమనార్హం.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్