Chandrababu: జగన్మోహన్ రెడ్డి తో విభేదాలు వచ్చి తెలంగాణలో తన తండ్రి పేరుతో పార్టీ ఏర్పాటు చేసిన షర్మిల.. మొదట్లో కొద్ది రోజులు పొలిటికల్ గా యాక్టివ్ గానే కనిపించారు. పాదయాత్ర పేరుతో హడావిడి చేశారు. కొన్నిసార్లు ఆమె మాటలు పరిధి దాటడంతో పోలీసులు అరెస్టు కూడా చేశారు. అంతేకాదు ఆమెను గృహ నిర్బంధంలో ఉంచారు. కోర్టు అనుమతితో మళ్ళీ ఆమె పాదయాత్ర ప్రారంభించారు. ఎన్నో ఆశలతో పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలి అనుకున్నారు. కానీ తీరా పోటీ చేసే నాటికి రాజకీయంగా పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఫలితంగా ఆమె కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి దాపురించింది.
అయితే ఇప్పుడు తాజాగా జరుగుతున్న చర్చ ఏంటంటే.. షర్మిల త్వరలోనే ఏపీ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారని.. కాంగ్రెస్ పార్టీ సారధ్య బాధ్యతలు తీసుకోబోతున్నారని.. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఇందుకు సుముఖంగా ఉన్నారని.. ఈ ఎన్నికల్లో కాకపోయినా.. వచ్చే ఎన్నికల్లో నైనా కాంగ్రెస్ పార్టీ ఏపీలో అధికారంలోకి వస్తుందని.. అనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనికి తోడు టిడిపికి అనుకూలంగా ఉండే మీడియా ముఖ్యంగా ఆంధ్రజ్యోతి షర్మిలకు విశేషమైన ప్రాధాన్యమిస్తోంది. ఆమె వేసే ప్రతి అడుగును అత్యంత పకడ్బందీగా పబ్లిష్ చేస్తోంది. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా షర్మిల పాదయాత్ర చేసినప్పుడు ఒక్క వార్త కూడా ఆంధ్రజ్యోతి రాయలేదు..పైగా నెగిటివ్ ప్రచారం చేసింది. అయితే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డితో షర్మిల విభేదాల వల్ల బయటికి వచ్చిందో.. అప్పుడే ఆంధ్రజ్యోతి షర్మిలను నెత్తిన ఎత్తుకోవడం ప్రారంభించింది.
షర్మిల కాంగ్రెస్ పార్టీ సారధ్య బాధ్యతలు తీసుకోబోతున్నారని ముందుగా రాసింది ఆంధ్రజ్యోతే. అంతే కాదు సొంత విశ్లేషణలను కూడా రాయడం ప్రారంభించింది. షర్మిల ఏపీలోకి వస్తే జగన్ కు ఇబ్బందేనని, ఆమె వల్ల కాంగ్రెస్ పార్టీకి ఓట్ల శాతం పెరుగుతుందని రాస్తోంది.. అయితే ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే అంతిమంగా నష్టపోయేది ఎవరు? లాభపడేది ఎవరు? దీనికి సింపుల్ ఆన్సర్.. షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తే కచ్చితంగా అది టిడిపికి మైనస్ అవుతుంది. వైసీపీ నుంచి కొంత మంది నాయకులు ఆ పార్టీలో చేరుతారు. ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చాలావరకు కాంగ్రెస్ పార్టీకి బదిలీ అవుతుంది. అప్పుడు టిడిపికి పడే ఓట్ల శాతం తగ్గుతుంది. ఫలితంగా వైసిపికి లాభం చేకూర్చుతుంది. మెజారిటీ స్థానాలు కనుక వైసిపి సాధిస్తే తిరిగి జగన్ ముఖ్యమంత్రి అవుతారు. అప్పుడు అంతిమంగా టిడిపి నష్టపోతుంది. కాంగ్రెస్ పార్టీకి పెద్దగా పోయేదేమీ లేదు కాబట్టి.. ఒకవేళ ఏవైనా స్థానాలు సాధిస్తే వాటిని బోనస్ గానే అనుకుంటుంది. వచ్చే ఎన్నికల నాటికి ఇంకా మరింత కష్టపడితే అధికారానికి దగ్గరవుతుంది. కానీ ఈ మాత్రం విశ్లేషణను పక్కనపెట్టి షర్మిల రాక వల్ల చంద్రబాబుకు బలం పెరుగుతుందని టిడిపికి అనుకూలంగా ఉండే మీడియా రాయడం శోచనీయం.
లేపి లేపి మరీ సెల్ఫ్ గోల్ చేసుకుంటున్న తెల్దేశం pic.twitter.com/Az3AXJddnB
— Inturi Ravi Kiran (@InturiKiran7) January 1, 2024