https://oktelugu.com/

అదంతా రాజకీయమేనా..? స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడుకునేదెలా..

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ మీద కేంద్రం ఏదైనా మంచి నిర్ణయం తీసుకుంటుందని నిన్నా మొన్నటివరకు ఇంతోఅంతో ప్రజల్లో ఆశలు ఉండేవి. కానీ.. నిన్న ఒక్కసారిగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆ ఆశలు తుంచివేశారు. స్టీల్‌ ప్లాంట్‌పై ఒక్కమాటలో తేల్చేశారు. రోడ్డెక్కి చేస్తున్న ఆందోళనలను.. అధికార ప్రతిపక్ష లేఖలను కేంద్రం లెక్కలోకి తీసుకోలేదు. వాటిని చెత్తబుట్టలో పడేసింది. ఎవరేం అనుకున్నా.. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను వంద శాతం అమ్మి తీరుతామని స్పష్టం చేసింది. Also […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 9, 2021 / 12:44 PM IST
    Follow us on


    విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ మీద కేంద్రం ఏదైనా మంచి నిర్ణయం తీసుకుంటుందని నిన్నా మొన్నటివరకు ఇంతోఅంతో ప్రజల్లో ఆశలు ఉండేవి. కానీ.. నిన్న ఒక్కసారిగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆ ఆశలు తుంచివేశారు. స్టీల్‌ ప్లాంట్‌పై ఒక్కమాటలో తేల్చేశారు. రోడ్డెక్కి చేస్తున్న ఆందోళనలను.. అధికార ప్రతిపక్ష లేఖలను కేంద్రం లెక్కలోకి తీసుకోలేదు. వాటిని చెత్తబుట్టలో పడేసింది. ఎవరేం అనుకున్నా.. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను వంద శాతం అమ్మి తీరుతామని స్పష్టం చేసింది.

    Also Read: తమిళనాడులో వార్‌‌ వన్‌ సైడే.. సీఎం పీఠం ఆయనదే..!

    విశాఖ ఉక్కు..- ఆంధ్రుల హక్కు.. ఉంటూ నినదించిన రాజకీయ పార్టీలది అంతా రాజకీయమే తప్ప.. స్టీల్ ప్లాంట్‌ను వాస్తవంగా కాపాడాలన్న లక్ష్యం లేదు. పోరాటంలో చిత్తశుద్ధి లేకపోవడంతో కేంద్రం కూడా ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్లుగా వ్యవహరిస్తోంది. స్టీల్ ప్లాంట్ అమ్మకం విషయంలో రాజకీయ పార్టీలు విశాఖలో ఆందోళనలు చేస్తున్నాయి. బంద్ చేపట్టాయి. రోజూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఆందోళలన్నీ విశాఖలోనో.. ఆంధ్రలోనో జరుగుతున్నాయి. ఢిల్లీ వరకూ వెళ్లడం లేదు. గల్లీలోనే పోరాటాలు చేసి.. ఢిల్లీ కదలలాంటే ఎలా సాధ్యం..? కానీ.. రాజకీయ పార్టీలు ఢిల్లీ వెళ్లి పోరాడాలని అనుకోవడం లేదు.

    కనీసం.. ఢిల్లీకి సెగ తగిలేలా.. విశాఖలో పోరాటం చేయాలన్న ఆలోచన కూడా చేయడంలేదు. ఫలితంగా అన్ని రాజకీయ పార్టీలు ప్రజల్ని మభ్య పెట్టే రాజకీయాలు చేసుకుంటున్నాయని.. తమ నిర్ణయాలు తాము తీసుకుంటామన్నట్లుగా కేంద్రం వ్యవహరిస్తోంది. అమ్మడం పక్కా అని తేల్చేసిన తర్వాత కూడా రాజకీయ పార్టీల స్పందన చూస్తే.. వారికి కేంద్రంపై పోరాడే ఆలోచన లేదని తేలిపోతుంది.

    Also Read: ఐదుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రులపై కేసీఆర్ ఫైర్

    ఆంధ్రప్రదేశ్‌కు లోక్‌సభలో 20 మంది ఎంపీలు ఉన్నారు. ఒక స్థానం ఖాళీగా ఉన్నా.. ఇరవై నాలుగు మంది ఎంపీలున్నారు. రాజ్యసభలోనూ పదకొండు మంది ఎంపీలు ఉన్నారు. వీరిలో అత్యధికులు వైసీపీకి చెందినవారే. ముగ్గురు లోక్‌సభ.. నలుగురు రాజ్యసభ ఎంపీలు మాత్రమే ఇతర పార్టీలకు చెందినవారు. వారు కూడా విశాఖ ప్రైవేటీకరణకు వ్యతిరేకమే. అంటే విధానపరంగా.. ఏపీకి చెందిన పార్లమెంట్ సభ్యులందరూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నారు. కానీ.. ఒక్కరంటే.. ఒక్కరు కూడా పార్లమెంట్‌లో తమ వ్యతిరేకతను వెల్లడించడం లేదు.

    ఎందుకో కానీ.. పార్టీలు కూడా ప్రజా రాజకీయం చేయడం లేదు. మభ్య పెట్టే రాజకీయమే చేస్తున్నాయి. దీంతో ఇప్పుడు ప్రజలే స్వచ్ఛందంగా ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. రాజకీయ పార్టీలకు చాన్స్ లేకుండా.. ప్రజల్లో నుంచే ఉద్యమ నేతలు పుట్టుకు రావాలి. ఉద్యమాన్ని ఏపీ మొత్తం హోరెత్తించాలి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పేరుతో జరుగుతున్న కుట్రపై ప్రజలకు అవగాహన కల్పించాలి. అలా ఉద్యమిస్తే.. స్టీల్ ప్లాంట్‌ను అమ్మకానికి పెట్టకుండా కేంద్రం వెనుకడుగు వేస్తుంది. లేకపోతే.. మొదటికే మోసం వస్తుంది.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్