ఈ మధ్య కాలంలో 30 సంవత్సరాల వయస్సు పైబడిన వారిలో చాలామంది డయాబెటిస్ బారిన పడుతున్న సంగతి తెలిసిందే. మధుమేహంతో బాధ పడేవాళ్లలో చాలామందిని ఏ ఆహారం తినాలి..? ఏ ఆహారం తినకూడదనే సందేహం వేధిస్తుంది. ముఖ్యంగా తియ్యగా ఉండే పండ్లు తినవచ్చా..? తినకూడదా..? అనే సందేహం చాలామందిని వేధిస్తుంది. ఎండకాలంలో ఎక్కువగా లభ్యమయ్యే పండ్లలో పుచ్చకాయ ఒకటనే సంగతి తెలిసిందే.
Also Read: అరటిపండ్లు తింటే బరువు పెరుగుతారా..? తగ్గుతారా..?
మరి మధుమేహులు పుచ్చకాయ తినవచ్చా..? తినకూడదా..? అనే ప్రశ్నకు ఎటువంటి సందేహం అవసరం లేకుండా పుచ్చకాయను తినవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. తినే ఆహార పదార్థాల్లోని గ్లూకోజ్ రక్తంలో ఎంత వేగంగా కలుస్తుందనే దానిని సూచించే సంఖ్యను గ్లైసెమిక్ ఇండెక్స్ అంటామని.. పుచ్చకాయ గ్లైసెమిక్ ఇండెక్స్ 72 కాగా ఇందులో పిండి పదార్థం తక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
Also Read: నోటి నుంచి దుర్వాసన వస్తోందా.. జాగ్రత్త పడాల్సిందే..?
పుచ్చాకాయలో నీటి శాతం ఎక్కువ కాబట్టి ఈ పండు తినడం వల్ల గ్లూకోజ్ లెవెల్స్ పెరిగినా గ్లూకోజ్ లెవెల్స్ మళ్లీ సాధారణ స్థాయికి వస్తాయని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. శరీరానికి అవసరమైన ఎన్నో విటమిన్లు, పోషకాలు పుచ్చకాయలో ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. పుచ్చకాయలోని విటమిన్లు, పోషకాలు శరీరంలో ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతాయని.. జీర్ణసంబంధిత సమస్యలను దూరం చేస్తాయని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.
మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం
జీవక్రియలు చురుకుగా జరగడంలో, రక్తపోటును తగ్గించడంలో పుచ్చకాయలు సహాయపడతాయి. పుచ్చకాయలో ఉండే మెగ్నీషియం, పొటాషియం కిడ్నీలకు రక్తప్రసరణ సరిగ్గా జరిగేలా చేస్తాయి. అందువల్ల మధుమేహ రోగులు పుచ్చకాయను తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.