Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను తాకట్టు పెడుతూ అప్పులు తీసుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పలు ప్రభుత్వ రంగ సంస్థలను తాకట్టు పెట్టి రూ. వేల కోట్లు అప్పుగా తీసుకుంది. ఇప్పుడు ఎయిడెడ్ పాఠశాలలను సైతం వదలడం లేదు. వాటిని కూడా తాకట్టు పెట్టాలని నిర్ణయించింది. దీని కోసం వాటిని తమ ఆధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నాలు ప్రారంభించింది. బలవంతంగా బెదిరించి అయినా వాటిని లాక్కోవాలని చూస్తోంది. అందుకే ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది.

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో ఎయిడెడ్ స్కూళ్లు 1988, ఎయిడెడ్ జూనియర్ కళాశాలలు 122, ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలు 137 ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన జీవోల ప్రకారం ఎయిడెడ్ స్కూళ్లను ప్రభుత్వానికి స్వాధీనం చేయాల్సి ఉంటుంది. కానీ విద్యాసంస్థలు మాత్రం దీనికి ససేమిరా అంటున్నాయి. దీంతో ప్రభుత్వం వాటిపై కొరఢా ఝళిపించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఒకవేళ ప్రభుత్వానికి ఇవ్వకుంటే స్కూళ్లను మూసి వేయడమే శరణ్యమని భావిస్తున్నాయి.
దీనిపై ప్రభుత్వం పెడుతున్న షరతులకు విద్యాసంస్థలు, విద్యార్థులు సైతం వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వానికి స్వాధీనం చేయని పాఠశాలల ఎయిడ్ నిలిపివేస్తామని చెబుతున్నారు. దీంతో అవి ప్రైవేటు సంస్థలుగానే గుర్తించాల్సి ఉంటుంది. ఈ కారణంగా కొన్ని స్కూళ్లు మూసివేయడానికి నిర్ణయించుకున్నట్లు సమాచారం. ప్రభుత్వం అధికారుల్ని ప్రయోగించి బలవంతంగా స్వాధీనం చేసుకోవాలని చర్యలు ప్రారంభించింది.
విద్యార్థులకు నష్టం కలిగించే చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించడం లేదు. ఫలితంగా విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉంది. ఫీజుల భారం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు రాజకీయ పార్టీలు సైతం మద్దతు ప్రకటిస్తున్నాయి. అయితే ప్రభుత్వం విధించే ఆప్షన్లు, జీవోలు యథావిధిగా కొనసాగితే ఎయిడెడ్ విద్యా సంస్థలకు భారీ నష్టమే కలగనుంది.
Also Read: ఎన్టీఆర్ – చరణ్ వెళ్తే జగన్ నిర్ణయం మారుతుందా ?
వీడిన వైఎస్ వివేకా హత్య కేసు మిస్టరీ.. హత్య వెనుక వైఎస్ కుటుంబీకులే