18 Pages: నిఖిల్​ 18పేజెస్​ సినిమా విడుదల తేదీ ఖరారు!

18 Pages: వచ్చిన చిన్నచిన్న పాత్రల్లో నటిస్తూ.. మెల్లగా హీరో ఛాన్స్​ కొట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు హీరో నిఖిల్​. హ్యాపీడేస్​, కార్తికేయ, స్వామిరారా వంటి విభిన్న కంథాంశాలతో ప్రేక్షకులను పలకరించి.. మంచి హిట్​లను అందుకున్నాడు. తాజాగా, ‘కుమారి 21 ఎఫ్‌’ ఫేమ్‌ సూర్యప్రతాప్‌ దర్శకత్వంలో 18 పేజెస్​ సినిమాలో హీరోగా కనిపించనున్నారు. ఇందులో అనుపమ పరమేశ్వరన్​ హీరోయిన్​గా నటించనుంది. టాలెంటెడ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కథ, స్క్రీన్‌ప్లే అందించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్‌ సమర్పణలో […]

Written By: Raghava Rao Gara, Updated On : November 14, 2021 3:29 pm
Follow us on

18 Pages: వచ్చిన చిన్నచిన్న పాత్రల్లో నటిస్తూ.. మెల్లగా హీరో ఛాన్స్​ కొట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు హీరో నిఖిల్​. హ్యాపీడేస్​, కార్తికేయ, స్వామిరారా వంటి విభిన్న కంథాంశాలతో ప్రేక్షకులను పలకరించి.. మంచి హిట్​లను అందుకున్నాడు. తాజాగా, ‘కుమారి 21 ఎఫ్‌’ ఫేమ్‌ సూర్యప్రతాప్‌ దర్శకత్వంలో 18 పేజెస్​ సినిమాలో హీరోగా కనిపించనున్నారు. ఇందులో అనుపమ పరమేశ్వరన్​ హీరోయిన్​గా నటించనుంది. టాలెంటెడ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కథ, స్క్రీన్‌ప్లే అందించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్‌ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మిస్తున్నారు.

తాజాగా, ఓ ఆసక్తికరమైన పోస్టర్​తో విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం. వచ్చే ఏడాది ఫిబ్రవరి 18 విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. పోస్టర్​ కూడా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. సుకుమార్ మార్క్ టచ్‌తో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన పోస్టర్లు, గ్లింప్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ పోస్టర్ తో సినిమాపై అంచనాలు మరింత పెంచుతున్నారు. ఇక పోస్టర్ ను చూసిన నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఈ సినిమాలో నిఖిల్ డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నాడని తెలుస్తోంది.

నిఖిల్  చందు మొండేటి దర్శకత్వంలో ‘కార్తికేయ 2’ సినిమా చేస్తున్నారు. ఇందులో హీరోయిన్‌గా అనుపమా పరమేశ్వరన్‌ను తీసుకున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో విడుదల చేయాలనుకుంటున్నారు. త్వరలోనే ఈ మూవీ కి సంబంధించి అప్డేట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.