https://oktelugu.com/

ఎంఐఎం, సీపీఐ కంటే దారుణమా? కాంగ్రెస్ పని ఖతమేనా?

బీహార్ లో గెలుపు వాకిట ఆర్జేడీ బొక్కా బోర్లా పడింది. ఆర్జేడీ విజయానికి దాని మిత్రపక్షం కాంగ్రెస్ అడ్డుపడింది. కాంగ్రెస్ లేకుంటే ఆర్జేడి గెలిచేదే. ఎక్కువ సీట్లు తీసుకొని తక్కువ సీట్లలో గెలిచి ఆర్జేడీ పుట్టి ముంచింది కాంగ్రెస్ పార్టీ అందుకే.. ఇప్పుడు కాంగ్రెస్ వరుసగా సీనియర్లు గళమెత్తుతున్నారు. ఇప్పటికే కపిల్ సిబల్ పార్టీ సంస్థాగత బలంపై విమర్శలు గుప్పించగా.. తాజాగా మరో సీనియర్ కాంగ్రెస్ నేత హాట్ కామెంట్స్ చేశారు. Also Read: బీజేపీ అసలు […]

Written By:
  • NARESH
  • , Updated On : November 19, 2020 1:10 pm
    Follow us on

    Congress

    బీహార్ లో గెలుపు వాకిట ఆర్జేడీ బొక్కా బోర్లా పడింది. ఆర్జేడీ విజయానికి దాని మిత్రపక్షం కాంగ్రెస్ అడ్డుపడింది. కాంగ్రెస్ లేకుంటే ఆర్జేడి గెలిచేదే. ఎక్కువ సీట్లు తీసుకొని తక్కువ సీట్లలో గెలిచి ఆర్జేడీ పుట్టి ముంచింది కాంగ్రెస్ పార్టీ అందుకే.. ఇప్పుడు కాంగ్రెస్ వరుసగా సీనియర్లు గళమెత్తుతున్నారు. ఇప్పటికే కపిల్ సిబల్ పార్టీ సంస్థాగత బలంపై విమర్శలు గుప్పించగా.. తాజాగా మరో సీనియర్ కాంగ్రెస్ నేత హాట్ కామెంట్స్ చేశారు.

    Also Read: బీజేపీ అసలు టార్గెట్ అదేనా

    బీహార్ ఎన్నికల్లో ఎంఐఎం, సీపీఐ వంటి పార్టీల కంటే కూడా కాంగ్రెస్ పార్టీ తేలిపోవడాన్ని చిదంబరం ఎండగట్టారు. ఎంఐఎం, సీపీఐ లాంటి పార్టీలు సంస్థాగతంగా బలంగా ఉంటే ఎన్నికల్లో విజయం సాధించవచ్చని నిరూపించాయని చిదంబరం అన్నారు. . బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దాని బలానికి మించి ఎక్కువ స్థానాల్లో పోటీచేసి ఓడిపోయిందని చిదంబరం హాట్ కామెంట్స్ చేశారు.. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా బలోపేతం కావాల్సిన అవసరం ఉందని చిదంబరం అభిప్రాయపడ్డారు.

    చిదంబరం తాజాగా వ్యాఖ్యానిస్తూ.. ‘వరుసగా రాష్ట్రాల ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఓటమి తనకు బాధ కలిగిస్తోంది. సంస్థాగత ఉనికిని కాంగ్రెస్ కోల్పోయినట్లు కనిపిస్తోంది. నిజానికి బీహార్ లో ఆర్జేడీ-కాంగ్రెస్ గెలవాల్సింది. అక్కడ ఓటమికి ఎవరు కారణం.. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, జార్ఖండ్ లలో గెలిచి ఎక్కువ కాలమేమీ కావట్లేదన్న విషయాన్ని పార్టీ గుర్తించాలి’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

    Also Read: బీజేపీపై పోరుకు కేసీఆర్‌‌ రెడీ.. ప్లాన్ ఏంటి?

    ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ పార్టీలోని సంస్థాగత లోపాలను సరిదిద్దుకోలేకపోతే కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడం అసాధ్యమని కుండబద్దలు కొట్టారు. ఇప్పుడు సిబల్ కు మద్దతుగా మరో సీనియర్ నేత చిదంబరం కూడా గళమెత్తాడు. కాంగ్రెస్ లో టాప్ లీడర్ గా కొనసాగే చిదంబరం సైతం పార్టీ వ్యవహారాలపై పెదవి విరిచాడు. కపిల్ సిబల్ వాదనకు బలం చేకూరేలా క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ నిజంగానే బలహీనపడిందని పేర్కొన్నాడు.

    కనీస పోరాట పటిమ కాంగ్రెస్ లో లోపించిందన్నది ఆ పార్టీ నేతల వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. అంతేకాదు క్షేత్రస్థాయిలో కనీసం ఎంఐఎం, సీపీఐ కంటే కాంగ్రెస్ కు బలం లేదన్న వాదనను కాంగ్రెస్ నేతలే అంగీకరిస్తుండడం గమనార్హం. దీన్ని బట్టి దేశంలో కాంగ్రెస్ పని అయిపోయిందా అన్న ఆవేదన ఆ పార్టీ కార్యకర్తల్లో నెలకొంది.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్