తెలంగాణలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే తెలంగాణలో 36కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే తెలంగాణలో లాక్డౌన్ అమలు చేస్తున్నారు. ఆదివారం ప్రధాని పిలుపు మేరకు యావత్ తెలంగాణ జనతా కర్ఫ్యూకు మద్దతు తెలిపింది. ప్రజల మద్దతు తెలంగాణ ప్రభుత్వం కరోనా నివారణకు మరింత కఠిన చర్యలకు పూనుకుంది. అయితే లౌక్డౌన్ విధించిన మొదటిరోజు ప్రజలు ఇళ్లకు పరిమితం అవగా రెండో రోజు నుంచి రోడ్లపైకి చేరడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
ప్రజలంతా స్వీయనియంత్రణ పాటించాలని ప్రభుత్వం సూచించిన కొందరు అనవసరంగా రోడ్లపై వస్తున్నారు. వీరిని మరికొందరు రోడ్లపైకి వస్తుండగా రోడ్లన్నీ జనసంద్రంగా మారాయి. దీంతో రంగంలోకి దిగిన అధికార యంత్రాంగం రోడ్లపైకి వచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటుంది. రోడ్లపైకి వాహనాలతో వచ్చేవారి వాహనాలను సీజ్ చేస్తోంది. పోలీసులతో అనవసరంగా వాదించే వారిపై జరిమానాలు విధించడంతోపాటు కేసులు నమోదు చేస్తుంది. దీంతో కొంతమేర రోడ్లపై వాహనాల రద్దీ తగ్గింది.
అయితే రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా తెలంగాణలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటిస్తారని వార్తలు విన్పిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితిపై ప్రగతి భవన్లో సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో హెల్త్ ఎమర్జెన్సీ విధించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. నేటి రాత్రి ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటన చేయనున్నారనే సమాచారంతోనే రాష్ట్రంలోనూ ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే కరోనా కట్టడిపై ప్రస్తుతం ప్రగతి భవన్లో ఇంకా సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశం అనంతరం కరోనా కట్టడి చేసేందుకు సీఎం కేసీఆర్ తీసుకున్న పలు కీలక నిర్ణయాలను వెల్లడించనున్నారు.