KCR-Chinna Jeeyar Swamy: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభిమానిస్తే అందలాలెక్కిస్తారు. వదిలేస్తే పాతాళానికి తొక్కేస్తారు. ఆయన మనసులో స్థానం ఇస్తే అంతే సంగతి. సకల వైభోగాలు సమకూరుస్తారు. ఇటీవల చినజీయర్ స్వామి కేసీఆర్ మధ్య కూడా విభేదాలు పొడచూపినట్లు తెలుస్తోంది. సమతామూర్తి విగ్రహావిష్కరణకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆహ్వానించడం తెలిసిందే. దీంతో ఆ కార్యక్రమానికి రాకుండా ఇంట్లోనే ఉండిపోయారు. ప్రధాని, సీఎం మధ్య ఉన్న వైషమ్యాల నేపథ్యంలోనే ఆయన దూరం ఉన్నట్లు తెలుస్తోంది.
మొత్తానికి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా వైరాలు కనిపిస్తున్నాయి. ప్రధాని మోడీతో సమతా మూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కనీసం కేసీఆర్ పేరు లేకుండా చేశారనే వాదనలు వస్తున్నాయి. దీంతోనే కేసీఆర్ అలక బూనినట్లు చెబుతున్నారు ఇక జీయర్ స్వామికి యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలోకి ఆహ్వానం ఉండదని తెలుస్తోంది. దీంతో ఒక కార్యక్రమం ఎంత దూరం చేసిందో అర్థమైపోతోంది.
Also Read: KCR Mamatha: కాంగ్రేసేతర కూటమికి బీజం..? కేసీఆర్, స్టాలిన్ కు మమత ఫోన్
ఈనెల 19న నిర్వహించే శాంతి కల్యాణం కూడా వాయిదా వేశారు. తరువాత నిర్వహించేందుకు చిన్న జీయర్ స్వామి నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. శాంతి కల్యాణంలో కేసీఆర్ కు సముచిత ప్రాధాన్యం ఇచ్చి గౌరవిస్తామని జీయర్ స్వామి చూస్తున్నా కేసీఆర్ మాత్రం వెళ్లడానికి ఇష్టపడటం లేదనే తెలుస్తోంది. మరోవైపు యాదాద్రి దేవాలయ పనులు పర్యవేక్షించేందుకు మరో స్వామి కోసం కేసీఆర్ ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
యాదాద్రి నిర్మాణం మొత్తం దగ్గరుండి నిర్మాణం చేయించిన జీయర్ స్వామికి ప్రస్తుతం అక్కడికి వెళ్లేందుకు మార్గాలు మూసుకుపోయినట్లు తెలుస్తోంది. ముచ్చింతల్ లోని జీయర్ ఆశ్రమానికి కూడా భవిష్యత్ లో కష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. దీంతో రాబోయే కాలంలో జీయర్ స్వామికి కేసీఆర్ చిక్కులు తీసుకొచ్చేందుకే ప్రయత్నాలు చేస్తారని తెలుస్తోంది.
Also Read: KCR Chinajiyar: చినజీయర్ స్వామిపై కేసీఆర్ కోపానికి అసలు కారణం అదేనా?