https://oktelugu.com/

Ghani Release Date: ఫిబ్రవరి 25న ‘గని’గా రానున్న వరుణ్ తేజ్ !

Ghani Release Date:  మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రిస్క్ చేసి మరీ బాక్సింగ్ నేపథ్యంలో చేస్తోన్న సినిమా ‘గని’. కాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్సయింది. ఫిబ్రవరి 25న థియేటర్లలో సినిమా రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించాడు. వరుణ్‌ సరసన బాలీవుడ్‌ బ్యూటీ సాయి మంజ్రేకర్ సందడి చేయనుంది. మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : February 15, 2022 / 01:47 PM IST
    Follow us on

    Ghani Release Date:  మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రిస్క్ చేసి మరీ బాక్సింగ్ నేపథ్యంలో చేస్తోన్న సినిమా ‘గని’. కాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్సయింది. ఫిబ్రవరి 25న థియేటర్లలో సినిమా రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించాడు. వరుణ్‌ సరసన బాలీవుడ్‌ బ్యూటీ సాయి మంజ్రేకర్ సందడి చేయనుంది.

    Ghani Release Date

    మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో సిజ్లింగ్ బ్యూటీ తమన్నా నటిస్తోంది. ఈ స్పెషల్ సాంగ్ లో వరుణ్ తేజ్‌ తో కలిసి రొమాన్స్ చేసింది ఈ ముదురు బ్యూటీ. మొత్తానికి తమన్నా ఈ సాంగ్ లో నటించడంతో గని సినిమా పై అంచనాలు పెరిగాయి.

    Also Read:  ఏపీలో మందు బాబులకు షాకిచ్చిన సీఎం జగన్

    ఇక ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సింగ్ కోట్ లో కండలు తిరిగిన దేహంతో ఫైట్ చేయబోతున్నాడు. వరుణ్ తేజ్ మొత్తానికి తన సిక్స్ ప్యాక్ బాడీతో సినిమా పై అంచనాలను పెంచాడు. అయితే ఈ సినిమాలో బాక్సర్‌ పాత్రలో నటించడానికి వరుణ్‌తేజ్‌ కఠినమైన కసరత్తులు చేయాల్సి వచ్చింది. వరుణ్ విదేశాలకు వెళ్లి మరీ బాక్సింగ్ కోచింగ్ తీసుకున్నాడు.

    Ghani Release Date

    పైగా కెరీర్ లో మొదటి సారి సిక్స్ ప్యాక్ లో షర్ట్ లేకుండా నటిస్తున్నాడు. మరి గనితో వరుణ్ తేజ్ భారీ హిట్ కొడతాడేమో చూడాలి. ఇక ఈ సినిమాతో అల్లు అర‌వింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీ మొదటిసారిగా నిర్మాతగా మారబోతున్నాడు. సిద్దు అనే మరో నిర్మాతతో కలిసి బాబీ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. సినిమా అవుట్ ఫుట్ బాగానే వచ్చింది అని టాక్ ఉంది.

    Also Read: అదరగొడుతున్న కళావతి.. 19 మిలియన్ వ్యూస్ !

    Tags