
Jagan vs Chandrababu: చంద్రబాబుకు అపర చాణక్యుడిగా పేరుంది. వ్యూహాలు రచించడంలో దిట్ట. ప్రత్యర్థి పార్టీని ఇరకాటంలో పెట్టే విధంగా తన యుక్తులు ప్రయోగించి దారి మళ్లించే చంద్రబాబు ఇటీవల తన వ్యూహాల అమలులో ఫెయిల్ అవుతున్నారు. ఫలితంగా ప్రత్యర్థి ముందు డీలా పడుతున్నారు. నలుగురి ముందు నవ్వుల పాలు అయినట్లుగా బాబు వ్యూహాలు పనిచేయడం లేదు. దీంతో తన రాజకీయ మనుగడలో విమర్శలు ఎదుర్కొంటున్నారు.
చంద్రబాబు బీజేపీతో పెట్టుకున్న సంబంధాలు కూడా అలాగే ఉంటున్నాయి. 2019 ఎన్నికలకు ముందు బీజేపీతో జట్టు కట్టిన బాబు తరువాత దానితో తెగదెంపులు చేసుకుని బహిరంగ విమర్శలకు దిగారు. దీంతో అభాసుపాలయ్యారు. ప్రస్తుతం మళ్లీ బీజేపీతో మంచి సంబంధాలు పెట్టుకోవాలని చూస్తున్నారు. కానీ బీజేపీ మాత్రం బాబు మాటలను నమ్మడం లేదు. ఎందుకంటే ఎప్పుడు ఎలా ఉంటారో తెలియని బాబు వైఖరిపై వారిలో విశ్వాసం కలగడం లేదు.
మరోవైపు వైసీపీని కూడా బీజేపీ కి దూరం చేయాలని బాబు ప్రణాళికలు వేస్తున్నా అవి ఫలించడం లేదు. బాబులా జగన్ బీజేపీకి ప్రత్యక్షంగా మద్దతు ఇవ్వడం లేదు. పరోక్షంగా బయట నుంచి నమ్మకంగా వ్యవహరిస్తూ తన పనులు చక్కబెట్టుకుంటున్నారు. కానీ బాబు అలా కాదు ప్రభుత్వంలో చేరి పదవులు సైతం పొంది తరువాత బయటకు వచ్చి అమీ తుమీ తేల్చుకోవాలని భావించారు.
ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో బాబు బీజేపీతో విభేదించారు. ఇటీవల జరుగుతున్న పరిణామాల్లో మళ్లీ బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని చూస్తోంది. కానీ జగన్ మాత్రం తన వైఖరి మార్చుకోకుండా ఎప్పుడు ఒకేలా ఉంటూ తన పనులు సులువుగా కానిచ్చేసుకుంటారు. ఈ నేపథ్యంలో బాబు ప్రణాళికలు నెరవేరడం లేదు. ఆయన వేసే పాచికలు పారడం లేదు. ఫలితంగా ఆయనే ఏకాకిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.