Homeఆంధ్రప్రదేశ్‌ఇంతలా ఓడిపోతున్న చంద్రబాబు ధైర్యం అదేనా?

ఇంతలా ఓడిపోతున్న చంద్రబాబు ధైర్యం అదేనా?

TDPఆడ లేక మద్దెల ఓడు అనేది సామెత. ఓటమిని జీర్ణించుకోలేని వారు తమ పరాజయానికి కారణాలు వేరే చూపుతూ కాలం వెళ్లబుచ్చుతుంటారు. కింద పడినా, మీద పడినా మాదే పైచేయి అనే వారుంటారు. సహజంగా ఓటమి చెందిన తరువాత ఎవరైనా మాట్లాడకుండా సైలెంట్ గా మారిపోతారు. వైసీపీ ఏకపక్ష విజయాలతో ముందుకు పోతున్నా టీడీపీ మాత్రం రెట్టించిన శబ్ధంతో విరుచుకుపడుతుందే కానీ మౌనం పాటించడం లేదు.

2019 ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లతో విజయం సాధించినప్పుడు టీడీపీ పని అయిపోయింది అనుకున్నారు. టీడీపీ సైలెంట్ అయిపోతుంది అని భావించారు. జగన్ చేతిలో వరుస ఓటములను తెలుగుదేశం లైట్ గా తీసుకుంటోంది. ఓడినా బెబ్బులిలా జగన్ మీద విరుచుకుపడుతోంది. ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని తేల్చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చూపుతామని బుకాయించింది బ్యాలెట్ పేపర్ పెడితే విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేసింది. కానీ లోకల్ ఎన్నికల్లో సైతం వెనుకంజ వేసింది.

లోకల్ బాడీ ఎన్నికలు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగాయి. అయినా వైసీపీ దౌర్జన్యం చేసిందని కొత్త పాట అందుకుంది. తిరుపతి ఎన్నికలో దొంగ నోట్లు పడ్డాయని ఆరోపణలు చేసింది. మరి మిగిలిన ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఫలితం కూడా వైసీపీకే అనుకూలంగా వచ్చింది. దీంతో టీడీపీ మరో మూడేళ్లు నిశ్శబ్ధంగా ఉంటుందని భావించారు. వైసీపీ వేసుకున్న అంచనాలు తలకిందులయ్యాయి. తిరుపతి ఎన్నికలో ఘోర ఓటమి తరువాత కూడా టీడీపీ ఎక్కడా తగ్గలేదు.

జగన్ విషయంలో తెలుగుదేశం తేలిగ్గా తీసుకోవడానికి కారణం ఏమై ఉంటుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సార్వత్రిక ఎన్నిక్లల్లో వైసీపీ గల్లంతు కావడం ఖాయమనే ధీమాగా ఉన్నారు. జగన్ మీద ఉన్న సీబీఐ కేసులు, ఏపీ ఆర్థిక వ్యవస్థ కుదేలు, కరోనా వంటి వ్యవహారాలతో జగన్ మీద కత్తి మీదసాములా మారింది. దీంతో వచ్చే ఎన్నికల్లో విజయం తమదేనని టీడీపీ భావిస్తోంది. 2024లో టీడీపీని ఓడిస్తేనే జగన్ విజయానికి సంపూర్ణత రాదని వైసీపీ వర్గాలు పేర్కొంటున్నాయి.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper
Exit mobile version