ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పాదయాత్ర సందర్భంగా గ్రామసచివాలయ వ్యవస్థను ప్రజల ముందు చర్చకు పెట్టారు. ఆ ఊరి యువతకు అక్కడే ఉపాధి చూపిస్తామని భరోసా కల్పించారు. దీంతో యువత నమ్మకంతో ఓట్లువేశారు. ఫలితంగా అధికారం హస్తగతం చేసుకున్నారు. దీంతో రెండున్నర లక్షల మందిని వాలంటీర్లు, మరో లక్షన్నర మంది సచివాలయ సిబ్బందితో నాలుగు లక్షల మంది వరకు నిరుద్యోగులకు అవకాశం కల్పించారు. కానీ వారికి జీతాలు మాత్రం ఇవ్వడం లేదు. దీంతో వారు అసంతృప్తితో ఉన్నారు.
రూ. లక్షల్లో వేతనాలు పొందే ప్రభుత్వ ఉద్యోగులు బద్దకస్తులైపోయారు. ఏ జీతాలులేని సచివాలయ ఉద్యోగులతో అన్ని పనులు చేయిస్తున్నారు. అన్ని శాఖలను సచివాలయంతో సమన్వయం చేయడంతో ప్రభుత్వ ఉద్యోగులకు పని లేకుండా పోయింది. దీంతో సచివాలయ ఉద్యోగులకు ఇటు జీతాలు లేక అటు పనిభారం పెరిగి కదేలవుతున్నారు. పై నుంచి వచ్చే ఆదేశాలను సచివాలయాలకు బదలాయించి ప్రభుత్వ ఉద్యోగులు విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో సచివాలయ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సచివాలయ వ్యవస్థ రెండేళ్లలో గాడి తప్పుతోందా అంటే నిజమే అనిపిస్తోంది. వార్డుల వరకే పరిమితం అయిన పనుు చేయడానికి సచివాలయ వ్యవస్థ రూపకల్పన చేశారు. కానీ అది గాడి తప్పింది. అన్ని శాఖల విభాగాలు వాడేసుకుని వారికి నయాపైసా ఇవ్వడం లేదు. దీంతో వారు నిరాశలో పడిపోయారు. పైసలు లేవుకాని పని మాత్రం ఉందని వాపోతున్నారు.జగన్ తీరుకు లోలోపలే తిట్టుకుంటున్నారు. ఇలాగైతే వ్యవస్థ ముందుకు పోవడం కష్టమని బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల బాగోగులు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.