Bandi Sanjay: తెలంగాణలో పట్టు కోసం బీజేపీ ప్రయత్నిస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలనే ఉద్దేశంతో తెలంగాణపై ఫోకస్ పెట్టింది. దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజురాబాద్ ఎన్నికల్లో విజయం దక్కిన నేపథ్యంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనని బీజేపీ చెబుతూ వస్తోంది. అందుకనుగుణంగానే కార్యక్రమాలు చేపడుతోంది. ఇందులో భాగంగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేసి అధికార పార్టీ టీఆర్ఎస్ ను దుయ్యబట్టారు. రాష్ట్రంలో కుటుంబ పాలన అంతం కావాలని పంతం పట్టారు. దీంతోనే బీజేపీ తన బలం పెంచుకోవాలని బావిస్తోంది. దీని కోసమే అహర్నిశలు శ్రమిస్తోంది.
వచ్చే నెలలో హైదరబాద్ లో జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. దీని కోసం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తోపాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. దీంతో ఈ సమావేశాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. భాగ్యనగరంలో నిర్వహించే సమావేశాలను విజయవంతం చేయాలని తీవ్రంగా శ్రమిస్తున్నారు. దీని కోసం కార్యకర్తలను సంసిద్ధులను చేస్తున్నారు.
Also Read: Pawan Kalyan CBN: చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ మైండ్ గేమ్!
ప్రతి రోజు సమావేశాలు నిర్వహించి అన్ని కమిటీల అధ్యక్షులను సమావేశాల నిర్వహణపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కనీసం రెండు లక్షల మందిని సమీకరించి సత్తా చాటాలని భావిస్తున్నారు. ప్రతి కార్యకర్త ఇంటింటికి వెళ్లి అందరికి ఆహ్వానాలు అందజేసి సమావేశాల్లో పాల్గొనాల్సిందిగా కోరాలని చెబుతున్నారు. జనసమీకరణ కోసం అందరు రెడీగా ఉండాలని పేర్కొంటున్నారు. దేశంలోని ముఖ్య నేతలందరు రానున్న నేపథ్యంలో సమావేశాలు ఘనంగా నిర్వహించి ప్రత్యర్థి పార్టీలకు సమాధానం చెప్పాలని చెబుతున్నారు. దీనికి గాను కార్యకర్తల నుంచి నేతల వరకు విశ్రమించకుండా పని చేయాలని ఉద్బోదిస్తున్నారు.
అన్నీ తానై వన్ మ్యాన్ షో గా బండి సంజయ్ తన ప్రభావం చూపనున్నారు. సమావేశాల్లో భారీగా జనసమీకరణ చేసి తమ ప్రభంజనం చూపించాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే పాదయాత్ర ద్వారా టీఆర్ఎస్ పై నిప్పులు చెరిగిన సంజయ్ మరోమారు జాతీయ కార్యవర్గ సమావేశాల నిర్వహణపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. దేశంలోని నేతలందరు రానుండటంతో కార్యక్రమం రంజుగా ఉండాలని చెబుతున్నారు. సమావేశాల్లో చేపట్టబోయే కార్యక్రమాల గురించి కూడా కార్యకర్తలతో చర్చిస్తున్నారు. జనసమీకరణకు చేయాల్సిన పనుల గురించి సూనలు చేస్తున్నారు. మొత్తానికి బండి సంజయ్ బీజేపీ ప్రతిష్టను మరింత ఇనుమడింపజేయాలని తాపత్రయ పడుతున్నట్లు తెలుస్తోంది.
Also Read: Interesting Facts In CAG Report: కాగ్ రిపోర్టులో ఆసక్తికర విషయాలు.. ఏపీ అప్పులు తక్కువేనా?