Posani Sensational Comments On Pawan Kalyan: టాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉన్న నటులలో ఒకరు పోసాని కృష్ణ మురళి..నటుడిగా , డైరెక్టర్ గా మరియు రచయితా గా పోసాని కృష్ణ మురళి కి ఎన్నో హిట్స్ ఉన్నాయి..గాయం సినిమా తో ప్రారంభమైన పోసాని కృష్ణ మురళి నట ప్రస్థానం మొన్న విడుదలైన సర్కారు వారి పాట సినిమా వరుకు కొనసాగింది..కేవలం నటుడిగా మాత్రమే కాకుండా రాజకీయ నాయకుడిగా కూడా పోసాని కృష్ణ మురళి బాగా పాపులర్ అయ్యాడు అనే విషయం మన అందరికి తెలిసిందే..ప్రస్తుతం ఆయన వైసీపీ పార్టీ లో కొనసాగుతున్నాడు..సందర్భాన్ని బట్టి ప్రత్యర్థి పార్టీలైన టీడీపీ మరియు జనసేన పై విరుచుకుపడిన సంఘటనలు చాలానే ఉన్నాయి..రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం సర్వసాధారణం..నిన్న మొన్నటి వరుకు మన పక్కనే తిరుగుతూ ఉండేవాళ్ళు కూడా రాజకీయ పరంగా వేరు అవ్వడం మనం గమనిస్తూనే ఉన్నాము..2009 వ సంవత్సరం లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ నుండి పోటీ చేసి ఓడిపోయిన పోసాని కృష్ణ మురళి..ఆ తర్వాత జగన్ పార్టీ పెట్టిన తర్వాత ఆయన వైపు వెళ్లిపోయిన సంగతి మన అందరికి తెలిసిందే..ఇవి అన్ని పక్కన పెడితే గత కొంత కాలం క్రితం పోసాని కృష్ణ మురళి పవన్ కళ్యాణ్ పై అతని కుటుంబం పై చేసిన అతి నీచమైన కామెంట్స్ సొంత పార్టీ వాళ్ళు ఆయనని చీదరించుకునేలా చేసింది.
Also Read: Agneepath: అగ్నిపథ్.. బీజేపీని కడిగిపారేసిన కేటీఆర్
పవన్ కళ్యాణ్ ఇంట్లో ఆడవాళ్ళని..చిన్నపిల్లలను కూడా వదలకుండా అతి నీచమైన బూతులు తిడుతూ పోసాని చేసిన వ్యాఖ్యలు ఎవ్వరు అంత తేలికగా మర్చిపోలేరు..అతని సినిమాల్లో కనిపించినప్పుడల్లా ఆయన చేసిన ఈ నీచమైన కామెంట్స్ గుర్తుకు వస్తూ ఉంటాయి..అయితే ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో పవన్ కళ్యాణ్ గురించి ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది..పవన్ కళ్యాణ్ తో పని చేసిన అనుభవం గురించి మాట్లాడుతూ ‘పవన్ కళ్యాణ్ సెట్స్ లో ఉన్నంతసేపు కేవలం తన సినిమా గురించి మాత్రమే చూసుకుంటారు..అవతలి వ్యక్తి గురించి మాట్లాడడం ఆయనకి ఇష్టం ఉండదు..అనవసరమైన మాటలు కూడా మాట్లాడడు..రాజకీయం గా మేము వేరు అయ్యినప్పటికీ కూడా సెట్స్ మీదకి వచ్చిన తర్వాత సినిమా గురించి తప్ప వేరే విషయాలు ఏవి కూడా చర్చించడు’ అంటూ చెప్పుకొచ్చాడు పోసాని కృష్ణ మురళి..పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది మరియు సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాల్లో పోసాని కృష్ణ మురళి నటించిన సంగతి మన అందరికి తెలిసిందే..అంతే కాకుండా పవన్ కళ్యాణ్ రెండవ సినిమా గోకులం లో సీత సినిమాకి కూడా ఆయన కథ, స్క్రీన్ ప్లే మరియు మాటలు అందించాడు.
Also Read: TS Government Coming Down: ‘సిల్లీ’ కామెంట్స్‌పై సీరియస్.. దిగివస్తున్న సర్కార్!