https://oktelugu.com/

Pavan Kalyan: జగన్, బాబులను బీట్ చేయాలంటే పవన్ ఏం చేయాలి..?

Pavan Kalyan: 2024 సార్వత్రిక ఎన్నికల కోసం ఏపీలో రాజకీయ హీట్ పెరిగిపోతోంది. అధికార పార్టీ కంటే ప్రతిపక్షాలు ఇప్పటినుంచే జోరును పెంచాయి. రకరకాల కార్యక్రమాలతో ప్రజల్లోకి చొచ్చుకుపోతున్నారు. ముఖ్యంగా జనసేన పార్టీ నేత పవన్ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తూ కేడర్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయిందని.. వచ్చే ఎన్నికల్లో తమదే విజయమని సంకేతాలిస్తున్నారు. అయితే విభజన ఏపీ ఏర్పడి రెండు పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. ఈ రెండుసార్లు ఇద్దరు వేర్వేరు పార్టీలకు […]

Written By:
  • NARESH
  • , Updated On : June 20, 2022 5:48 pm
    Follow us on

    Pavan Kalyan: 2024 సార్వత్రిక ఎన్నికల కోసం ఏపీలో రాజకీయ హీట్ పెరిగిపోతోంది. అధికార పార్టీ కంటే ప్రతిపక్షాలు ఇప్పటినుంచే జోరును పెంచాయి. రకరకాల కార్యక్రమాలతో ప్రజల్లోకి చొచ్చుకుపోతున్నారు. ముఖ్యంగా జనసేన పార్టీ నేత పవన్ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తూ కేడర్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయిందని.. వచ్చే ఎన్నికల్లో తమదే విజయమని సంకేతాలిస్తున్నారు. అయితే విభజన ఏపీ ఏర్పడి రెండు పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. ఈ రెండుసార్లు ఇద్దరు వేర్వేరు పార్టీలకు చెందిన వారు ముఖ్యమంత్రులయ్యారు. వారు సీఎంలు కావడానికి వారు ఎంచుకున్న నినాదమే.. మరి ఇప్పుడు ఫ్యూచర్ సీఎం పవనే అని అనుకుంటున్న తరుణంలో ఆయన ఎలాంటి నినాదం తెరపైకి తెస్తారనే చర్చ హాట్ హాట్ గా సాగుతోంది. మరోవైపు విభజన ఏపీలో రెండు సార్లు రెండే వేర్వేరు పార్టీలు అధికారంలోకి వచ్చాయి. ఇప్పడు మూడో పార్టీకి అవకాశం ఇచ్చే సాంప్రదాయాన్ని కొనసాగిస్తారా..? అని చర్చించుకుంటున్నారు.

    Pavan Kalyan

    ఉమ్మడి ఏపీ నుంచి విభజించిన తరువాత 2014 ఎన్నికల్లో టీడీపీ గెలుపొందింది. ఆ సమయంలో వైసీపీ ఉన్నా ప్రజలు ఆదరించలేకపోయారు. అందుకు అప్పటికే అపార అనుభవమున్న చంద్రబాబు.. కష్టాలతో ఏర్పడిన ఏపీని అభివృద్ధి చేస్తానని ప్రచారం చేశారు. ఏపీ విభజన విషయంలో చాలా తప్పులు చేశారని, అయితే గతంలో తాను సీఎం గా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధిని మరోసారి చేసి చూపిస్తానని అన్నారు. అయితే అప్పటికే ఉమ్మడి ఏపీలో రెండు సార్లు కాంగ్రెస్ హవా సాగింది. మరోవైపు తమను అన్యాయంగా విభజించారన్న కోపం కాంగ్రెస్ పై పడింది. దీంతో ప్రత్యామ్నాయం బాబేనని గుర్తించి ఆ ఎన్నికల్లో టీడీపీని గెలిపించారు.

    Chandra Babu

    2019 ఎన్నికల్లో బాబుకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ఎందుకంటే 2014లో చెప్పిన హామీలను బుట్టదాఖలు చేశారు. అంతేకాకుండా అప్పటికీ రాజధాని నిర్మాణంలో నాన్చుడు ధోరణి అవలంబిస్తున్నారని విసిగిపోయిన ఏపీ ప్రజలు జగన్ కు జై కొట్టారు. 153 సీట్లు ఆ పార్టీకి వచ్చాయంటే…టీడీపీపై ఎంత కసిగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని వైసీపీ అధినేత జగన్ తనకు అనుగుణంగా మార్చుకున్నారు. బాబు చేసిన అవినీతిని తనకు ఒక్క చాన్ష్ ఇస్తే అంతమొందిస్తానని ప్రచారం చేశారు. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించినా ఏమాత్రం నోరు మెదపకుండా బీజేపీతో పొత్తుపెట్టుకున్నారంటూ జగన్ చేసిన ప్రసంగం ఆకట్టుకుంది.

    Y S Jagan

    తరువాత సార్వత్రిక ఎన్నికలకు మరో రెండేళ్లు ఉంది. ఈ తరుణంలో ఈసారి వైసీపీ, టీడీపీతో పాటు జనసేన పట్టు పెంచుకుంటోంది. గత ఎన్నికల్లో ఆ పార్టీకి ఒకే ఒక్క సీటిచ్చిన ప్రజలు ఇప్పుడు ఆ పార్టీ వైపే చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో ఆ పార్టీకి కాస్తో.. కూస్తో సీట్లు గెలుచుకుంది. అయితే ఆ సమయంలో బీజేపీతో పొత్తు లేకుంటే మరిన్ని సీట్లు వచ్చేవని జనసైనికులు వాపోయాయి.

    Also Read: Star Heroine Nagma: స్టార్ హీరోయిన్ నగ్మా ఎంతమంది హీరోలతో ప్రేమాయణం నడిపిందో తెలుసా..?

    అయితే వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలను ఆకట్టుకోవాలంటే కొత్త నినాదాన్ని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే జగన్, బాబులు తమ అధికార, అనుభవ బలాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. పవన్ ఇటీవల రైతు కుటుంబాలకు లక్ష చొప్పున పంపిణీ చేసి వారి ఆదరణ పొందారు. అయితే ఎన్నికల వరకు ఎలాంటి నినాదంతో ప్రజల్లోకి వెళ్తారోనన్న ఆసక్తి పెరిగింది. అయితే ఆ నినాదమేదైనా ప్రజలు నమ్మగలిగేదిలా ఉండాలని అంటున్నారు.

    Pavan, Babu, Jagan

    Also Read: Posani Sensational Comments On Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన పోసాని

    Tags