Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ వేగవంతం అయింది. దీంతో కొన్ని ప్రాంతాల్లో ఆగ్రహజ్వాలలు పెరిగాయి. కానీ ప్రభుత్వం మాత్రం ఆపడం లేదు. దీంతో ప్రతిపక్ష తెలుగుదేశం మాత్రం రాష్ర్టంలో అలజడి పెరిగిపోయిందని ఫోకస్ పెంచుతోంది. ఒక మంచి పని చేసినపుడు కొన్ని విమర్శలు రావడం సహజమే. అంతమత్రాన అదేదో ఘోరం జరిగిపోతోందని గగ్గోలు పెట్టడం సబబు కాదు. ప్రస్తుతం రాష్ర్టంలో జరుగుతున్నది కూడా అదే. కొత్త జిల్లాల ఏర్పాటుతో చిత్తూరులో జరుగుతున్న గొడవలను టీడీపీ క్యాష్ చేసుకోవాలని చూస్తోంది.

జగన్ పాదయాత్ర సమయంలోనే జిల్లాలను పెంచుతానని హామీ ఇచ్చారు. పార్లమెంట్ స్థానానికో జిల్లా చొప్పున పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే కొన్ని ప్రాంతాల్లో కొందరు కావాలనే రాద్దాంతం చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై పెద్దగా ఆలోచించాల్సిందేమీ లేదు. ఏ పని చేసినా విమర్శలు రావడం మామూలే. కానీ ఇందులో ప్రతిపక్షం పాత్ర ఉందనే విషయం వైసీపీ నేతలు చెబుతున్నారు.
పైగా టీడీపీ నేతల్లోనే హర్షం వ్యక్తమవుతోంది. తమ నేత చేయలేని పనిని జగన్ చేస్తున్నారని ముచ్చట పడిపోతున్నారు. 2014లో కొత్త జిల్లాల ఏర్పాటు గురించి చర్చకు వచ్చినా చంద్రబాబు పట్టించుకోలేదు. కొత్త ప్రాజెక్టులు చేపట్టి విమర్శలెందుకు తెచ్చుకోవడం అని పక్కన పెట్టేశారు. దీంతో ప్రస్తుతం జగన్ దీన్ని అమలు చేసి ప్రజల్లో పరపతి పెంచుకోవాలని చూస్తున్నారు. దీనికి చంద్రబాబు అడ్డు పుల్ల వేస్తున్నారని చెబుతున్నారు.
Also Read: Andhra Pradesh: ఏపీలో సమస్యలు వారికి గుర్తుకు రావడం లేదా?
ఎవరిని సంప్రదించకుండానే కొత్త జిల్లాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని వాదిస్తున్నా మంచి పని చేయడానికి ముహూర్తం చూసుకోవాలా అనే వాదనలు కూడా వస్తున్నాయి. దీంతో భిన్న వాదనలు తెరమీదకు వస్తున్నాయి. జగన్ చేసిన దాంట్లో తప్పేమీ లేదని ప్రజలు అక్కడక్కడ విమర్శలు చేస్తే పట్టించుకోవాల్సిన పని లేదని చెబుతున్నారు. అమరావతి రాజధానిగా చేసిన సమయంలో చంద్రబాబు ఎవరిని సంప్రదించారనే ప్రశ్నలు వస్తున్నాయి.
దీంతో సహజంగానే కొన్ని చోట్ల అభ్యంతరాలు వచ్చినా పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదని తెలుస్తోంది. అయితే ఇంత హడావిడిగా చేయాల్సిన అవసరం ఏమిటనే ప్రశ్న ప్రతిపక్షంలో తలెత్తుతున్నా దాని గురించి ఎవరు ఆలోచించడం లేదు. కానీ కొత్త జిల్లాల ఏర్పాటుతో జగన్ మరో ముందడుగు వేసినట్లు ప్రజల్లో సానుకూల దృక్పథం వ్యక్తమవుతోంది.
Also Read: Andhra Pradesh: ఎడిటర్స్ వర్షన్ : మొత్తం చేతులారా నాశనం చేసి.. ఇప్పుడు కొత్తగా అరుపులెందుకు..?
[…] Also Read: Andhra Pradesh: ఏపీ రావణకాష్టంలా మారుతోందా? […]
[…] Also Read: ఏపీ రావణకాష్టంలా మారుతోందా? […]
[…] Telugu Stars Education Qualifications: సినిమా స్టార్స్ కి సంబంధించిన ప్రతి విషయంపై జనాల్లో ఆసక్తి ఉంటుంది. వాళ్ళ ప్రొఫెషనల్, పర్సనల్ గురించి తెలుసుకోవాలని ఆత్రుత ఉంటుంది. తినే తిండి, కట్టే బట్ట, వాడే కారు ఇలా ప్రతి మేటర్ న్యూస్ అవుతుంది. అలాంటి వాటిలో ఎడ్యుకేషన్ కూడా ఒకటి. వెండితెరను తిరుగులేకుండా ఏలుతున్న స్టార్ హీరోల చదువు సంధ్య లేమిటో తెలుసుకుందాం… […]
[…] Mango Media: సింగర్ సునీత తన మనసుకు నచ్చిన రామ్ వీరపనేనిని రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తన భర్తతో హాయిగా ఉంది సునీత. అయితే, సునీత భర్త ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ‘మ్యాంగో వీడియోస్’ అధినేత అని తెలిసిందే. కాగా రామ్ వీరపనేని ఛానెల్ వివాదంలో చిక్కుకుంది. కొన్ని వీడియోల్లో గౌడ మహిళలను వేశ్యలుగా చూపించారంటూ గౌడ కుల సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలోనే మ్యాంగో వీడియోస్ కార్యాలయంపై దాడి కూడా జరిగింది. […]