Amaravathi: అమరావతి ‘భ్రమరావతి’యేనా.. తెరపైకి కార్పొరేషన్ వ్యవహారం..

Amaravathi: విభజిత ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని ఏదనే విషయమై ఇంకా స్పష్టత రావడం లేదు. వైసీపీ ప్రభుత్వం అమరావతి రాజధాని కాదని మూడు రాజధానుల అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చింది. కానీ, ఇటీవల ఆ బిల్లును విత్ డ్రా చేసుకుని సమగ్రమైన బిల్లుతో మళ్లీ సభ ముందుకు వస్తామని తెలిపింది. అయితే, మొత్తంగా క్యాపిటల్ సిటీగా పేర్కొన్న అమరావతిలో మాత్రం ఇటవల పనులు మొదలయ్యాయి. గత రెండున్నరేళ్లుగా నిలిచిపోయిన పనులన్నీ కూడా మళ్లీ షురూ అయ్యాయి. అయితే, రాజధాని […]

Written By: Mallesh, Updated On : January 6, 2022 11:49 am
Follow us on

Amaravathi: విభజిత ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని ఏదనే విషయమై ఇంకా స్పష్టత రావడం లేదు. వైసీపీ ప్రభుత్వం అమరావతి రాజధాని కాదని మూడు రాజధానుల అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చింది. కానీ, ఇటీవల ఆ బిల్లును విత్ డ్రా చేసుకుని సమగ్రమైన బిల్లుతో మళ్లీ సభ ముందుకు వస్తామని తెలిపింది. అయితే, మొత్తంగా క్యాపిటల్ సిటీగా పేర్కొన్న అమరావతిలో మాత్రం ఇటవల పనులు మొదలయ్యాయి. గత రెండున్నరేళ్లుగా నిలిచిపోయిన పనులన్నీ కూడా మళ్లీ షురూ అయ్యాయి.

Amaravathi

అయితే, రాజధాని ఎక్కడ ఉంటుందనేది మాత్రం ఇంకా ఓ కొలిక్కి రాలేదని పలువురు అంటున్నారు. అమరావతియే రాజధానిగా ఉండాలని మరో వైపున రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సంగతుల నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం ఎలా వ్యవహరించబోతున్నదన్నది చర్చనీయాంశంగా ఉంది.

Also Read: ఆ పనులు పూర్తి చేసే దిశగా జగన్.. బాబుకు విమర్శించే ఛాన్స్ ఇవ్వరా..?

ఇటీవల ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో పాలనా వికేంద్రీకరణ చట్టాన్ని ఏపీ సర్కారు ఉపసంహరించుకుంది. అయితే, ఏపీ సర్కారు తీసుకునే నిర్ణయాలను, చట్టాలను సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలు అయ్యాయి. ప్రస్తుతం వాటిని ఏపీ హై కోర్టులో ఉన్నాయి. ఇంకా విచారణ దశలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే గతంలో రద్దు చేసిన సీఆర్ డీఏను మనుగడలోకి తీసుకొచ్చి 19 గ్రామాలను కార్పొరేషన్ గా ఏర్పాటు చేయడం కోసం ట్రై చేస్తోంది. ఇందుకుగాను ప్రయత్నాలు స్టార్ట్ అయ్యాయి. అయితే, గతంలో 29 రెవెన్యూ గ్రామాలు సీఆర్ డీఏలో ఉంటే ఈ సారి 19 గ్రామాలను తీసుకుంటే మరో పది గ్రామాల పరిస్థితి ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.

అలా మరోసారి కార్పొరేషన్ ఏర్పాటు పేరుతో ప్రజల నుంచి వైసీపీ సర్కారు వ్యతిరేకతను ఎదుర్కొనేందుకుగాను సిద్ధమవుతున్నది. ఇలా గత నిర్ణయాలను యాజ్ ఇట్ ఈజ్‌గా కాకుండా వైసీపీ సర్కారు తనకు అనుకూలంగా అమలు చేస్తుందనే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడుతోంది. ఇలా కార్పొరేషన్ ఏర్పాటు విషయమై ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చినందుకుగాను ఆ డెసిషన్ వెనక్కు తీసుకున్న వైసీపీ సర్కారు మళ్లీ అటువంటి ప్రతిపాదనతోనే ముందుకొచ్చి ఇలా కార్పొరేషన్ ఏర్పాటు చేయడంపైన పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: జగన్ ను ఓడించడానికి చంద్రబాబు వేసిన ప్లాన్ ఇదే..

Tags