టీఆర్ఎస్లోకి ఇనుగాల పెద్దిరెడ్డి..టికెట్ ఎవరికీ..?

మాజీ మంత్రి ఈటల రాజీనామాతో హూజూరాబాద్ లో ఉప ఎన్నిక అనివార్యం కానుంది. ఈ నేపథ్యంలో ఈటల బీజేపీ నుంచి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. అయితే కాంగ్రెస్ నుంచి టికెట్ వస్తుందో.. రాదోననే అనుమానంతో ఇక్కడున్న ఆ పార్టీ కీలక నాయకుడు కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరేందుకు రెడీ అవుతున్నారు. ఇటీవల ఆయన కాంగ్రెస్ చీఫ్ పై పరుష వ్యాఖ్యలు చేయడంతో ఆయన టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. తాజాగా మాజీ మంత్రి, ప్రస్తుతం […]

Written By: NARESH, Updated On : July 13, 2021 12:19 pm
Follow us on

మాజీ మంత్రి ఈటల రాజీనామాతో హూజూరాబాద్ లో ఉప ఎన్నిక అనివార్యం కానుంది. ఈ నేపథ్యంలో ఈటల బీజేపీ నుంచి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. అయితే కాంగ్రెస్ నుంచి టికెట్ వస్తుందో.. రాదోననే అనుమానంతో ఇక్కడున్న ఆ పార్టీ కీలక నాయకుడు కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరేందుకు రెడీ అవుతున్నారు. ఇటీవల ఆయన కాంగ్రెస్ చీఫ్ పై పరుష వ్యాఖ్యలు చేయడంతో ఆయన టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. తాజాగా మాజీ మంత్రి, ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్న ఇనుగాల పెద్దిరెడ్డి కూడా కారెక్కనున్నుట్లు సమాచారం.

ఇనుగాల పెద్దిరెడ్డి టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేశారు. ఆ తరువాత పార్టీ పరిస్థితి దిగజారడంతో కాంగ్రెస్లోకి వెళ్లారు. ఆ తరువాత కాషాయం కండువా కప్పుకున్నారు. గత ఎన్నికల్లో పెద్దిరెడ్డి బీజేపీ నుంచి పోటీ చేసి మూడోస్థానానికి పడిపోయారు. అయితే ఇటీవల ఈటల రాజేందర్ రాజీనామా చేయడంతో హుజూరాబాద్ లో ఉప ఎన్నిక సందడి నెలకొంది. రోజురోజుకు ఈటలకు మద్దతు పెరుగుతుండడంతో టీఆర్ఎస్ పక్కా వ్యూహం రచించినట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలోని సీనియర్ నాయకులను పార్టీలో చేర్చుకునేందుకు ప్లాన్ వేస్తున్నారు.

ఇటీవల పెద్దిరెడ్డి తండ్రి మరణించారు. అయితే ఆ సమయంలో ఆయనను కలవలేక ఈ ప్రాంత టీఆర్ఎస్ కీలక నాయకుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు పెద్దిరెడ్డిని ఫోన్లో పరామర్శించారు. అయితే ఆయన తండ్రి కర్మ కార్యక్రమానికి మాత్రం స్వయంగా హాజరైన పెద్దిరెడ్డితో మాట్లాడారు. ఇదే సందర్భంగా ఆయన టీఆర్ఎస్లో చేరాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు టీఆర్ఎస్ అభ్యర్థిపై ఇంకా కొలిక్కి రాలేదు. అయితే ముందుగా సీనియర్ నాయకులను పార్టీలో చేర్చుకొని ఆ తరువాత అభ్యర్థిత్వంపై ప్రకటన చేయనున్నారు.

మరోవైపు పెద్దిరెడ్డి ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు. ఈటల ఆ పార్టీలో చేరడంతో పెద్దిరెడ్డి ప్రాధాన్యంకోల్పోయారు. ప్రస్తుతం ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో పెద్దరెడ్డికి టికెట్ వచ్చే అవకాశం లేనట్లే తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టికెట్ కేటాయిస్తే టీఆర్ఎస్ లోకి వెళ్లాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే కౌశిక్ రెడ్డి తనకే టికెట్ వస్తుందని అని ప్రకటించాడు. అయితే పెద్దిరెడ్డి చేరికతో టికెట్ పై నిర్ణయం ఎటు వెళ్తుందోనన్న చర్చ సాగుతోంది.