నవ్వులాటలు కాదు..ఇక మరణమృదంగమే!

  దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఎంతగా పెరుగుతున్నాయంటే మరికొన్ని రోజుల్లో ప్రపంచంలో కరోనా కేసుల విషయంలో మన దేశం మొదటి స్థానానికి చేరుకోబోతుంది. ఇంకా నిజం చెప్పాలంటే ఇప్పటికిప్పుడు దేశంలో అందరికి కరోనా పరీక్షలు నిర్వహిస్తే.. ఈ రోజే అమెరికాను దాటి పోయే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి కోవిద్ విలయతాండవం దేశంలో కొనసాగుతున్న వేళ ప్రతి ఒక్కరం వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రముఖులను వదలని కరోనా మహమ్మారి డీఎంకే ఎమ్మెల్యే కన్నుమూత! […]

Written By: Neelambaram, Updated On : June 26, 2020 12:05 pm
Follow us on

 

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఎంతగా పెరుగుతున్నాయంటే మరికొన్ని రోజుల్లో ప్రపంచంలో కరోనా కేసుల విషయంలో మన దేశం మొదటి స్థానానికి చేరుకోబోతుంది. ఇంకా నిజం చెప్పాలంటే ఇప్పటికిప్పుడు దేశంలో అందరికి కరోనా పరీక్షలు నిర్వహిస్తే.. ఈ రోజే అమెరికాను దాటి పోయే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి కోవిద్ విలయతాండవం దేశంలో కొనసాగుతున్న వేళ ప్రతి ఒక్కరం వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ప్రముఖులను వదలని కరోనా మహమ్మారి

  • డీఎంకే ఎమ్మెల్యే కన్నుమూత!
  • ముంబయి మున్సిపల్ కమిషనర్ కన్నుమూత!
  • ముంబయిలో దాదాపుగా 30 మంది పోలీసులు కూడా కన్నుమూత!
  • గుజరాత్ , ఢిల్లీ ముఖ్యమంత్రులు హోం ఐసొలేషన్!
  • జూనియర్ సింధియా , ఆమె తల్లీ ఇద్దరూ ఆసుపత్రిలో…!

ఒక్క ఢిల్లీలోనే జూలై 30 నాటికి 5 లక్షల పైచిలుకు కేసులు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. మనదేశంలో టెస్టులు అందరికీ చేస్తే ఈపాటికే అమెరికాని దాటిపోయేవాళ్ళమంటే అతిసియోక్తి కాదు. దేశం మొత్తంలో 30 జిల్లాలలో పరిస్థితి ఆందోళనకర స్థాయికి చేరుకుంది.

అపోహలకు తావు ఇవ్వొద్దు

వయస్సులో ఉన్న వాళ్లకి ఏమీ కాదు అనుకోవటం తప్పు. ఇటీవల హైదరాబాద్ లో చనిపోయిన జర్నలిస్ట్ వయస్సు కేవలం 30 సంవత్సరాలు మాత్రమే.. అలాగే… 23 సంవత్సరాలు ఫైనల్ ఇయర్ మెడిసిన్ విద్యార్థి కూడా కరోనాతో చనిపోయింది.

ప్రభుత్వాలు చేతులైతేశాయి…

ప్రభుత్వాలు చేయగలిగినదంతా చేసి చివరికి ఏమి చేయలేక చేతులెత్తసాయి. ఇక ప్రజల చేతుల్లోనే కరోనా కట్టడి ఉంది. జాగ్రత్తలు పాటించండి.

  • మనిషికి మనిషికి దూరం పాటించండి!
  • మాస్కులు వాడండి!
  • ఎంతో అవసరమైతేనే బయటకి వెళ్ళండి!
  • సానిటైజర్ బాటిల్స్ జేబులో పెట్టుకోండి!

ఇక ఎంతమాత్రం నవ్వులాట పనికిరాదు , ఆ స్థాయి దాటిపోయిందనేది గ్రహిస్తే మంచిది. ఇంకా అర్థమయ్యేటట్లు చెప్పాలంటే కురుక్షేత్ర యుద్ధం ముగిసే సమయానికి ప్రతి ఇంటిలో విషాదం నెలకొన్నది ,కనీసంలో కనీసం ఇంటికొకరు చనిపోయారట అలాంటి విపత్తు మళ్ళీ దేశంలో వచ్చినా ఆశ్చర్యం లేదేమో! కాబట్టి అధికారులు బాధ్యతలు విధిగా నిర్వర్తించండి. వాస్తవాలు బయటకు చెప్పండి. ఏమి చేస్తే మంచిదో ప్రజలకు తెలపండి. దేశ ప్రజలను కరోనా పై యుద్ధానికి సిద్ధం చేయండి. దేశాన్ని కాపాడండి.