Naresh Goyal: అతడి పేరు నరేష్ గోయల్.. 1967లో పంజాబ్ రాష్ట్రంలోని పాటియాలా నుంచి ఢిల్లీకి వచ్చాడు. అప్పటికి అతడి వయసు 18 సంవత్సరాలు మాత్రమే. పేద కుటుంబం.. పైగా రెండు పూటలా భోజనం కూడా కష్టమే అటువంటి నేపథ్యం నుంచి వచ్చినవాడు.. ఢిల్లీలోని ఓ ట్రావెల్ ఏజెన్సీలో పనిచేయడం మొదలుపెట్టాడు. అక్కడ పనిచేస్తూ తన కుటుంబానికి ఎంతో కొంత ఆసరాగా ఉండేవాడు. ఆ తర్వాత గోయల్ ట్రావెల్ ఏజెన్సీలో పనిచేయడాన్ని అత్యంత జాగ్రత్తగా పరిశీలించేవాడు. నాలుగు సంవత్సరాల మాత్రమే అక్కడ పనిచేసిన అతడు.. జీవితకాలం అనుభవం సంపాదించాడు. సొంతంగా ట్రావెల్ ఏజెన్సీ మొదలుపెట్టాడు. దానికి ఆ రోజుల్లోనే జెట్ ఎయిర్ అని నామకరణం చేశాడు. జెట్ ఎయిర్ అని పేరు పెట్టడాన్ని కొంతమంది చులకనగా చూసినప్పటికీ నరేష్ గోయల్ ఏమాత్రం పట్టించుకోలేదు. తర్వాత కొంతకాలానికి నరేష్ గోయల్ సొంత ఎయిర్ లైన్స్ మొదలుపెట్టాడు. 1991లో జెట్ ఎయిర్ వేస్ ను ప్రారంభించాడు. ఆ రోజుల్లోనే దానిని అతడు ఎయిర్ టాక్సీ అని పేర్కొనేవాడు. ప్రారంభ సంవత్సరంలో 4 విమానాలను అతడు కొనుక్కున్నాడు. ఆ తర్వాత 2007లో ఎగుర్ సహారా ను సొంతం చేసుకున్నాడు. 2010 వరకు దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థగా తన కంపెనీని నెలకొల్పాడు. అయితే ఆ తర్వాత అతని పతనం మొదలైంది. పనిలో నష్టాలు విపరీతంగా వచ్చాయి. 2019 నాటికి అతడు తన పదవి నుంచి బయటికి వెళ్లాల్సి వచ్చింది. ఇక అదే ఏడాది జెట్ ఎయిర్ వేస్ కార్యకర్త పాలు పూర్తిగా నిలిచిపోయాయి.
Also Read: ఒక్క ఆర్డర్ తో 41దేశాలకు షాక్ ఇచ్చిన ట్రంప్.. వాళ్లెవరూ అమెరికాలో అడుగు పెట్టలేరు
అప్పుల్లో మునిగిపోయాడు
నరేష్ గోయల్ కెనరా బ్యాంక్ నుంచి తీసుకున్న అప్పు ఏకంగా 538 కోట్లకు పెరిగిపోయింది. మిగతా బ్యాంకులు కూడా అతడిని ఎగవేతదారుగా ప్రకటించాయి. ఇదే కేసులో 2023 సెప్టెంబర్లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆయనను అరెస్టు చేశారు. మనీలాండరింగ్ సెక్షన్లు కూడా పెట్టారు.. నరేష్ గోయల్ ఉద్దేశపూర్వకమైన ఎగవేతదారు కాకపోయినప్పటికీ.. ఎందుకనో ఆయనకు ప్రతిదీ వ్యతిరేకంగా మారింది. ఇక గత ఏడాది మే నెలలో ఆయన భార్య కన్ను మూసింది. క్యాన్సర్ వ్యాధి బారినపడి చికిత్స పొందుతూ చనిపోయింది. గోయల్ కూడా క్యాన్సర్ బారిన పడ్డాడు. అతడికి ఇప్పుడు 75 సంవత్సరాలు.. క్యాన్సర్ వ్యాధిని మరణంగా చూపిస్తూ నరేష్ గోయల్ కోర్టు నుంచి బెయిల్ పొందాడు. ప్రస్తుతానికి అతడు జైలు నుంచి విడుదలైనప్పటికీ.. ఒకప్పటి పరిస్థితి ఇప్పుడు లేదు. భార్య చూస్తుండగానే కన్ను మూసింది. ఆయనను క్యాన్సర్ ఇబ్బంది పెడుతోంది. వేలకోట్ల సంపద.. వేల మంది సిబ్బంది.. పరిమితమైన సౌకర్యాలు.. అనంతసాధ్యమైన భోగాలు ఇవన్నీ ఇప్పుడు నరేష్ గోయల్ కు దూరమయ్యాయి. దూరంగా చెప్పాలంటే మేఘాలలో విహరించిన ఆయన ఇప్పుడు కిందికి వచ్చాడు. అనంత దేశాలను చుట్టి వచ్చిన ఆయన కంపెనీ విమానాలు నేలకూలాయి. డబ్బుందని.. వందలు, వేలకోట్లు ఉన్నాయని.. పరిమితమైన వైభోగం కాళ్ల ముందు ఉందని.. అనంతమైన సౌభాగ్యాలు కళ్ళ ముందు ఉన్నాయని విర్రవీగే వారికి నరేష్ గోయల్ ఉదంతం ఒక బలమైన ఉదాహరణ. వెలిసిపోయిన రంగుల చిత్రానికి గాడమైన నిరూపణ.