Roja Selvamani: సెల్వమణిని రోజా ఎలా ప్రేమించింది? పెళ్లి చేసుకుంది? ఆ హాట్ లవ్ స్టోరీ ఎలా మొదలైందంటే?

రాజకీయాలతో పాటు బుల్లితెరలో జబర్దస్త్ షోలో జడ్జిగా కూడా వ్యవహరించారు. మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ షో కు దూరమయ్యారు. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న ఆమె.

Written By: Dharma, Updated On : November 9, 2023 3:32 pm

Roja Selvamani

Follow us on

Roja Selvamani: ఆర్కే రోజా.. దక్షిణాది సినీ రంగంలో పరిచయం అక్కర్లేని పేరు. సీనియర్ హీరోయిన్ గా సుపరిచితం. 90వ దశకంలో ప్రముఖ కథానాయక గా రాణించారు ఆమె. తెలుగులో సీనియర్ హీరోలు సరసన సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. తమిళ చిత్ర పరిశ్రమలో సైతం మంచి చిత్రాలతో తనదైన ముద్ర వేసుకున్నారు. తరువాత రాజకీయాల్లో అడుగుపెట్టారు. సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్నారు. ప్రస్తుతం ఏపీ టూరిజం శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపడుతున్నారు.

రాజకీయాలతో పాటు బుల్లితెరలో జబర్దస్త్ షోలో జడ్జిగా కూడా వ్యవహరించారు. మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ షో కు దూరమయ్యారు. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న ఆమె.. సినీ రంగంలో మాత్రం శాశ్వత ముద్ర వేసుకున్నారు. తమిళ దర్శకుడు సెల్వమణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఒక విధంగా చెప్పాలంటే సెల్వమణి ప్రోత్సాహంతోనే ఈ స్థాయికి చేరుకోగలిగారు. అయితే వీరిది ప్రేమతో పాటు పెద్దలు కుదిర్చిన వివాహంగా తెలుస్తోంది. అయితే వీళ్ళ లవ్ స్టోరీ ఎలా మొదలైంది? మొదట ఎవరు ప్రపోజ్ చేశారు? అన్నది మాత్రం ఆసక్తికర విషయం.

మొదటిసారిగా సెల్వమణిని ఓ సినిమా కార్యాలయంలో కలిశారట. ఆ సమయంలో ఆయన తమిళంలో చామంతి సినిమా తీసే ప్రయత్నంలో ఉన్నారు. హీరోయిన్ కోసం వెతుకుతున్న సమయంలో ఓ అసిస్టెంట్ డైరెక్టర్ రోజా ఫోటోను సెల్వమణికి చూపించారట. దీంతో ఆయన రోజాను కార్యాలయానికి రప్పించారట. అయితే రోజా తండ్రి తో పాటు సెల్వమణి ఆఫీసుకు వెళ్లారట. అలా వారి మధ్య పరిచయం ఏర్పడింది. మేకప్ టెస్ట్ చేసి రోజాను సెల్వమణి ఓకే చేశారట. అలా ఆ సినిమా షూటింగ్ జరిగేటప్పుడు వారి మధ్య పరిచయం ఏర్పడింది.

అయితే వారి మధ్య స్నేహం ఉన్నా సెల్వమణి పెద్దగా మాట్లాడేవారు కాదట. ఓ రోజు సెల్వమణికి రోజా వెంకటేశ్వర స్వామి ఫోటోను గిఫ్ట్ గా ఇచ్చారు. అప్పటి నుంచే రోజాపై ఆయనకు సదాభిప్రాయం ఏర్పడింది. రోజా తనపై ప్రేమతో ఇచ్చిందని సెల్వమణి భావించారు. కానీ ఒకరి ప్రేమను ఒకరు వ్యక్తపరుచుకోలేదు. ఓ రోజు సెలవమని నేరుగా రోజా ఇంటికి వెళ్లి పెళ్లి చేసుకుంటానని ఆమె తల్లిదండ్రులను అడిగారట. అప్పటికే రోజాకు సెల్వమణి పై సదాభిప్రాయం ఉండడంతో తల్లిదండ్రులు ఓకే చెప్పేశారు. వివాహాన్ని జరిపించారు. ఆ దంపతులకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉన్నారు. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నా.. తన ప్రతి విజయం వెనుక తన భర్త సెల్వమని ఉన్నారని రోజా సగర్వంగా చెప్పుకుంటారు.