https://oktelugu.com/

Bandla Ganesh On Pawan Kalyan: తన దేవుడు పవన్ పైనే అంత మాట అనేసిన బండ్ల గణేష్

పవన్ కళ్యాణ్ కు బండ్ల గణేష్ వీరభక్తుడు. ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో ప్రకటించాడు కూడా.పవన్ నటించిన తీన్ మార్, గబ్బర్ సింగ్ నిర్మించినది బండ్ల గణేషే.

Written By:
  • Dharma
  • , Updated On : December 28, 2023 / 10:51 AM IST

    Bandla Ganesh On Pawan Kalyan

    Follow us on

    Bandla Ganesh On Pawan Kalyan: బండ్ల గణేష్ సంచలనాలకు వేదికగా నిలుస్తున్నారు. వృత్తిరీత్యా సినిమా రంగం అయినా..రాజకీయాలపై ఎక్కువగా మాట్లాడుతుంటారు. సమకాలిన రాజకీయ అంశాలపై హాట్ కామెంట్స్ చేస్తుంటారు. ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో ఆయన చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని..ప్రమాణస్వీకారానికి రెండు రోజులు ముందే ఎల్బీ స్టేడియానికి వెళ్లి పడుకుంటానని కూడా ప్రకటించారు. ఇక టిఆర్ఎస్ పై చేసిన ట్వీట్లు అన్ని ఇన్ని కావు. అయితే అదే అలవాటులో ఇప్పుడు పవన్ కళ్యాణ్ పై బండ్ల గణేష్ హాట్ కామెంట్స్ చేయడం విశేషం.

    పవన్ కళ్యాణ్ కు బండ్ల గణేష్ వీరభక్తుడు. ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో ప్రకటించాడు కూడా.పవన్ నటించిన తీన్ మార్, గబ్బర్ సింగ్ నిర్మించినది బండ్ల గణేషే. గబ్బర్ సింగ్ సినిమా తోనే ఇండస్ట్రీలో బండ్ల గణేష్ నిలదొక్కుకున్నాడు. అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ విషయంలో బండ్ల గణేష్ లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. మొన్న మంచిన నా సినిమాలు కోసం నేను ఏ హీరో కైనా పొగుడుతానని తేల్చి చెప్పారు. అందరు హీరోలు తనకు సమానమేనని చెప్పుకొచ్చారు. అక్కడితో ఆగకుండా ఓ విషయంలో జగన్ పాలనను మెచ్చుకున్నారు. చంద్రబాబు అరెస్ట్ సమయంలో అయితే ఏకంగా కన్నీరు పెట్టుకున్నారు. ఇవన్నీ చాలవన్నట్టు ఇప్పుడు పవన్ విషయంలో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఏంటి బండ్లన్న ఎలా మారిపోయారు అంటూ నెటిజెన్లు ప్రశ్నించే దాకా పరిస్థితి వచ్చింది.

    ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ కు అనుకోని ప్రశ్న ఎదురయ్యింది. సోషల్ మీడియా ప్రొఫైల్ పిక్ లో మీరు చదువుతూ కనిపించారు ఏంటి? మీకు పుస్తకాలు చదవడం అంత ఇష్టమా? అంటూ యాంకర్ ప్రశ్నించాడు. అయితే తాను ప్రతిరోజు గంటకు పైగా పుస్తకాలు చదువుతానని.. అందులో ఉన్న మంచి పాయింట్స్ ను అండర్ లైన్ చేస్తానని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు. తనకు చిన్నప్పటి నుంచి ఆ అలవాటు ఉందని గుర్తు చేశారు. అంతటితో ఆగకుండా తాను రోజుకి గంట మాత్రమే పుస్తకాలు చదువుతానని.. అంతేకానీ లక్షలు సంఖ్యలో పుస్తకాలు చదవనని.. గొప్పలు చెప్పుకోనంటూ తేల్చి చెప్పారు. అయితే ఈ వ్యాఖ్య పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి చేసినదే నన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. గతంలో ఓ సందర్భంలో పవన్ కళ్యాణ్ తాను లక్ష పుస్తకాలు చదివానని చెప్పుకొచ్చారు. ఇప్పుడు దానికి కౌంటర్ గానే బండ్ల గణేష్ మాట్లాడారని.. పవన్ తో ఎక్కడో చెడిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అందుకే బండ్ల అన్న ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనికి బండ్ల గణేష్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.