పరీక్షలపై వెనక్కి తగ్గిన జగన్

ఏపీలో ఇంటర్మీడియెట్ పరీక్షలపై సీఎం జగన్ వెనక్కి తగ్గారు. అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్న వేళ ఈ పరీక్షలను వాయిదా వేశారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులంతా ఆందోళన చెందుతుండడం.. పలువురు నేతలు, ప్రముఖులు వద్దని వారించడం.. ఇక హైకోర్టు కూడా పునరాలోచించాలని సూచించిన నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేయాలని ఏపీసర్కార్ నిర్ణయించింది. ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ మేరకు ప్రకటించారు. విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలను సైతం పరిగణలోకి తీసుకొని పరీక్షలు వాయిదా వేశామని […]

Written By: NARESH, Updated On : May 2, 2021 6:10 pm
Follow us on

ఏపీలో ఇంటర్మీడియెట్ పరీక్షలపై సీఎం జగన్ వెనక్కి తగ్గారు. అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్న వేళ ఈ పరీక్షలను వాయిదా వేశారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులంతా ఆందోళన చెందుతుండడం.. పలువురు నేతలు, ప్రముఖులు వద్దని వారించడం.. ఇక హైకోర్టు కూడా పునరాలోచించాలని సూచించిన నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేయాలని ఏపీసర్కార్ నిర్ణయించింది.

ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ మేరకు ప్రకటించారు. విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలను సైతం పరిగణలోకి తీసుకొని పరీక్షలు వాయిదా వేశామని తెలిపారు. రాష్ట్రంలో పరిస్థితులు చక్కబడ్డాక ఇంటర్ పరీక్షల తేదీలను ప్రకటించనున్నట్లు మంత్రి వెల్లడించారు.

విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా.. వారి ప్రాణాల మీద మమకారంతో బాధ్యతగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మంత్రి తెలిపారు. సురక్షిత వాతావరణంలో పరీక్షలు నిర్వహించాలని అనుకొని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

అయితే దేశంలో రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని.. అందుకే పరీక్షలు వాయిదా వేసినట్టు మంత్రి తెలిపారు.