ఇన్ టాక్ : తెదేపా సోషల్ మీడియా vs సోము వీర్రాజు !

గత కొన్ని సంవత్సరాలుగా దేశ రాజకీయాల్లో సోషల్ మీడియా పాత్ర ఎక్కువైపోయింది. ఇక ఆంధ్రప్రదేశ్ వంటి దక్షిణాది రాష్ట్రాల్లో అయితే అది గ్రౌండ్ లెవెల్ లో ప్రజలను ఉత్సాహపరిచేందుకు కావచ్చు, మభ్యపెట్టడం లో కావచ్చు, అబద్ధపు ప్రచారంలో చేయడంలో కావచ్చు లేదా ఒక పార్టీ పై వారికున్న భావనను మరింత బలపరిచేందుకు కావచ్చు…. ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇక ఇలాంటి సమయంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పై టీడీపీ సోషల్ మీడియా విపరీతంగా విరుచుకుపడుతోంది. కన్నా […]

Written By: Navya, Updated On : August 29, 2020 4:33 pm
Follow us on

గత కొన్ని సంవత్సరాలుగా దేశ రాజకీయాల్లో సోషల్ మీడియా పాత్ర ఎక్కువైపోయింది. ఇక ఆంధ్రప్రదేశ్ వంటి దక్షిణాది రాష్ట్రాల్లో అయితే అది గ్రౌండ్ లెవెల్ లో ప్రజలను ఉత్సాహపరిచేందుకు కావచ్చు, మభ్యపెట్టడం లో కావచ్చు, అబద్ధపు ప్రచారంలో చేయడంలో కావచ్చు లేదా ఒక పార్టీ పై వారికున్న భావనను మరింత బలపరిచేందుకు కావచ్చు…. ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇక ఇలాంటి సమయంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పై టీడీపీ సోషల్ మీడియా విపరీతంగా విరుచుకుపడుతోంది.

కన్నా లక్ష్మీనారాయణ బిజెపి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు టీడీపీ సోషల్ మీడియా అసలు అతనిని పట్టించుకోలేదు కానీ వీర్రాజు పై మాత్రం పెద్ద యుద్ధమే చేస్తోందట. కన్నా లక్ష్మీనారాయణ ఉన్నప్పుడు వైసిపి సోషల్ మీడియా అతనిపై తీవ్రంగా విరుచుకుపడింది. టిడిపి కి అనుకూలంగా రాజకీయం చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేసింది. టిడిపి తొత్తు అని జనాలను విపరీతంగా నమ్మించగా…. బిజెపి అధిష్టానం లక్ష్మీనారాయణను పదవినుండి తొలగించడానికి కూడా కారణం అదే అని ప్రచారం సాగించింది.

ఇప్పుడు ప్రస్తుతం ఇదే ప్లాన్ ను టీదిపి మీడియా అమలుచేస్తోంది. అటు చానల్స్ తో పాటు ఇటు సోషల్ మీడియా వారు కూడా సోము వీర్రాజు ని టార్గెట్ చేసి వైసీపీ బంటు అని నిరూపించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట. అయితే దీనిపై చివరికి పోలీసులకు ఫిర్యాదు చేసే పరిస్థితి కూడా వచ్చిందని సమాచారం.

ఇక సోము వీర్రాజు మాత్రం ఇవేమి పట్టించుకోకుండా రాష్ట్రంలో ఏకధాటిగా ముందుకు దూసుకెళ్తున్నారు. వైసీపీ నుంచి అధికారం వదులుకొని ఎవరూ రారు కాబట్టి టిడిపిని విచ్ఛిన్నం చేసే దిశగా ఆయన ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. టిడిపి రాష్ట్ర ప్రజలకు చేసిన అన్యాయాలను ఎత్తి చూపుతూనే సరైన ప్రత్యామ్నాయం తామే అన్న వాదనను కూడా ఎప్పటికప్పుడు నిరూపిస్తూ ప్రజల్లో బలంగా తీసుకెళ్తున్నారు. మరి ప్రజలు టిడిపి సోషల్ మీడియా వర్సెస్ సోము వీర్రాజు యుద్ధంలో ఎవరిని సపోర్ట్ చేస్తారో చూడాలి.