
Troll of the Day : రాజకీయాల్లో స్వయంప్రకాశకులుగా ఉండటం వేరు.. పరాన్న ప్రకాశకులుగా ఉండటం వేరు.. ఇందులో చంద్రబాబు ఏ కేటగిరో చెప్పాల్సిన అవసరం లేదు. కానీ పచ్చ మీడియా చంద్రబాబును ఆకాశానికి ఎత్తేస్తుంది. 2019 లో చంద్రబాబు 23 సీట్ల వద్ద ఆగిపోయినప్పటికీ.. ” అంతగా బాధపెట్టామా” అని నెయ్యి పూసి లేపనాల లాంటి వార్త రాస్తుందే కానీ.. అసలు తప్పు ఎక్కడ జరిగిందో మాత్రం చెప్పదు. అందుకే కదా జనం పచ్చ మీడియాను వదిలి సోషల్ మీడియా వైపు పరుగులు తీస్తోంది.. ఆయనప్పటికీ ఆ పచ్చ మీడియాకు బుద్ధి రాదు. చంద్రబాబు స్తుతి కీర్తన మానుకోదు.
ఇక ఏపీలో అనేక ఓటమి తర్వాత, జగన్ చేతిలో అనేక పరాభవాల తర్వాత.. జగన్ పార్టీ స్వయంకృతపరాధం తర్వాత టిడిపి నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు గెలుచుకుంది. దీంతో ఆ పార్టీలో సహజంగానే ఆత్మవిశ్వాసం పెరిగిపోయింది. అంతేకాదు ఇప్పుడు పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ లో ఉత్సాహం కట్టలు తెంచుకుంటున్నది. కానీ ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్న పార్టీని మరింత పటిష్టం చేయాలని చంద్రబాబు నాయుడు తలపోస్తున్నారు.. ఇక్కడే సక్కగా లేదు గానీ.. ఢిల్లీలో ఎందుకు చక్రాలు తిప్పవు అని ఆంధ్రజ్యోతి ఆర్కే అడుగుతున్నాడు? నీకేం తక్కువ బాబూ? ఆ రాహుల్ గాంధీ మీద అనర్హత పెట్టు వేస్తే ఎందుకు స్పందించవు? చివరికి వైయస్సార్ ఆత్మ కేవీపీ రామచంద్రరావు కూడా నిన్ను ఢిల్లీ రమ్మంటున్నాడు కదా? పోయి నీ సత్తా ఏమిటో చూపించవచ్చు కదా? అని చంద్రబాబునాయుడుని ప్రశ్నిస్తున్నాడు.
ఉప్పు తిన్న విశ్వాసం ఉన్నవాడు(బాబు విషయం లో మాత్రమే) కాబట్టి ఆర్కే అలా రాసి ఉండవచ్చు. అందులో తప్పులేదు కూడా. కానీ దానికి జర్నలిజం అనే పేరు ఎందుకు? చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఢిల్లీకి వెళ్లిపోతే ఆంధ్రప్రదేశ్ కు ఏమైనా నష్టం ఉందా? అంత సత్తా ఉన్నవాడే అయితే, 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్నవాడే అయితే.. 2019 ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయినట్టు? జగన్ చేతిలో వరుస చావు దెబ్బలు ఎందుకు తిన్నట్టు? ఈ ప్రశ్నలకు రాధాకృష్ణ దగ్గర సమాధానం ఉందా?
అప్పట్లో ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీ ముద్దు అని అన్న చంద్రబాబు యూ టర్న్ తీసుకున్నాడు. సహజంగానే పచ్చ మీడియా కూడా యూటర్న్ తీసుకుంది. జనం చెవిలో పచ్చ పూలు పెట్టింది. కాని జనం అంత అమాయకులు కాదు. చూశారు ఎవడు మోసకారి? ఎవడు మాయ కారి అని… తర్వాత కర్రు కాల్చి వాత పెట్టారు.. 23 దగ్గర కూర్చోబెట్టారు. జగన్ స్వయంకృతాపరాధం వల్ల ఆ నాలుగు ఎమ్మెల్సీ సీట్లు వచ్చాయి గాని.. అతడే కనుక పకడ్బందీగా పరిపాలించి ఉంటే చంద్రబాబు గాని అటు పచ్చ మీడియాకు గాని ఆంధ్రప్రదేశ్లో ఉనికి ఉండేది కాదు..కానీ ఇవేవీ మననంలో పెట్టుకోకుండా చంద్రబాబును లే లే అంటే ఎలా లేస్తాడు? అక్కడ ఉన్నది మోదీ.. గతంలో ఇష్టానుసారంగా మాట్లాడిన వాడే.. మొన్న మోదీ అపాయింట్మెంట్ కోసం అర్రులు చాచాడు. మోడీ దర్శనమే పది వేలు అనుకున్నాడు. ఈ నిజాలు తెలిసి కూడా ఆర్కే భలే కవర్ చేశాడు. అది ఆర్కే అవసరం. అది జనాల అవసరం కాదు. కానేరదు.