ముగిసిన దీక్ష.. రెండేళ్లలో సీఎం అవుతానన్న షర్మిల

ఆలూ లేదు.. చూలు లేదు మళ్లీ తెలంగాణ సీఎం’ అని వైఎస్ షర్మిల చెప్పుకుంది. ఇంకా పార్టీ తెలంగాణలో ప్రకటించలేదు. పార్టీ నిర్మాణం లేదు. కార్యకర్తలు, నేతలు లేరు.. అప్పుడే వచ్చే రెండేళ్లలో సీఎం అవుతానంటూ తాజాగా ప్రకటించారు. షర్మిల 72 గంటల దీక్ష ముగింపు వేళ ఆమె ‘సీఎం కలలు’ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. నేల విడిచి షర్మిల సాముచేస్తోందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తెలంగాణలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ […]

Written By: NARESH, Updated On : April 18, 2021 4:33 pm
Follow us on


ఆలూ లేదు.. చూలు లేదు మళ్లీ తెలంగాణ సీఎం’ అని వైఎస్ షర్మిల చెప్పుకుంది. ఇంకా పార్టీ తెలంగాణలో ప్రకటించలేదు. పార్టీ నిర్మాణం లేదు. కార్యకర్తలు, నేతలు లేరు.. అప్పుడే వచ్చే రెండేళ్లలో సీఎం అవుతానంటూ తాజాగా ప్రకటించారు. షర్మిల 72 గంటల దీక్ష ముగింపు వేళ ఆమె ‘సీఎం కలలు’ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. నేల విడిచి షర్మిల సాముచేస్తోందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

తెలంగాణలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 72 గంటల నిరాహార దీక్ష చేపట్టిన వైఎస్ షర్మిల ఆదివారం తన దీక్షను ముగించారు. ఉద్యోగాల కోసం తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాల సభ్యుల చేతుల మీదుగా నిమ్మరసం తీసుకొని దీక్షను విరమించారు.

నిరాహార దీక్షను ముగించిన అనంతరం షర్మిల మాట్లాడారు. కేసీఆర్ సర్కార్ పై నిప్పులు చెరిగారు. “కేసీఆర్ పాలించిన గత ఏడు సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయలేదు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం నలభై లక్షల మంది యువకులు ఎదురుచూస్తున్నారు. నిరాశ చెందిన యువకులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. మా పార్టీ కార్యకర్తలు దీనిపై ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోరాటాన్ని కొనసాగిస్తారు. ఉద్యోగాలు ప్రకటించే వరకు విశ్రమించలేది లేదు. తెలంగాణలో రెండేళ్లలో మా పార్టీ అధికారంలోకి వస్తుంది. మేము నిరుద్యోగాన్ని తెలంగాణలో లేకుండా చేస్తాం. ” అని షర్మిల చెప్పుకొచ్చారు.

ఈ ఏడాది జూలైలో తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించాలని యోచిస్తున్న షర్మిల ప్రస్తుతం తెలంగాణ నిరుద్యోగుల పక్షాన పోరాడుతున్నారు. తెలంగాణలో 1.91 లక్షల ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం ఇందిరా పార్క్‌లో దీక్షను ప్రారంభించారు.

షర్మిల తన అన్నయ్య, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిని విభేదించి పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో ఒంటరి రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు.

ఖమ్మంలో బహిరంగ సభలో ప్రసంగించిన వారం రోజుల తర్వాత ఆమె నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని దీక్ష చేపట్టారు. తన తండ్రి వైఎస్ఆర్ జన్మదినం జూలై 8 న రాజకీయ పార్టీని ప్రారంభిస్తామని ప్రకటించారు.