ఐపీఎల్ లో ఈ ఆదివారం రెండు మ్యాచ్ లు జరుగనున్నాయి. సాయంత్రం ఒకటి.. రాత్రి మరోటి ప్లాన్ చేశారు. తొలి మ్యాచ్ మధ్యాహ్నం ప్రారంభమవుతుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య ఈ ఐపీఎల్ మ్యాచ్ జరుగుతోంది.
తొలుత టాస్ నెగ్గిన బెంగళూరు జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. విరాట్ కోహ్లీ సారథ్యంలో బెంగళూరు ఈసారి జోరు మీద ఉంది. గత రెండు మ్యాచ్ లలో గెలిచి హ్యాట్రిక్ విజయాలపై కన్నేసింది.
ఇక కోల్ కతా కూడా బలంగా కనిపిస్తోంది. ఒక మ్యాచ్ నెగ్గి.. మరో మ్యాచ్ ఓడిన కోల్ కతా ఈ రోజు బెంగళూరులో విజయం సాధించి రెండో మ్యాచ్ గెలవాలని పట్టుదలగా ఉంది.
ఈ రెండు జట్లు గత ఏడాది రెండు సార్లు తలపడ్డాయి. రెండు సార్లు బెంగళూరు గెలిచింది.
;ప్రస్తుతం సాయంత్రం వరకు బెంగళూరు 9 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయి 79 పరుగులతో ఆడుతోంది. కెప్టెన్ కోహ్లీ 5 పరుగులకే ఔట్ కాగా.. వన్ డౌన్ లో వచ్చిన పట్టేదార్ కూడా 1 పరుగుకే వెనుదిరిగాడు. పడికల్ 18, మ్యాక్స్ వెల్ 51 పరుగులతో ఆడుతున్నారు.