https://oktelugu.com/

CM Jagan: ‘ఇండోసోల్’.. జగన్ చేస్తోన్న మరో పెట్టుబడి మాయ?

తాజాగా ఇండోసోల్ అనే కంపెనీ పేరు వినిపిస్తోంది. ఏడాది కిందట పది లక్షల పెట్టుబడితో ఈ కంపెనీని ప్రారంభించారు. ఎక్కడా ఒక్క ఆఫీస్ ఉండదు. ఉత్పత్తి ఉండదు. అయినా సరే విశాఖపట్నం ఏకంగా 76 వేల కోట్ల పెట్టుబడిని ఈ కంపెనీ ప్రకటించింది.

Written By:
  • Neelambaram
  • , Updated On : October 16, 2023 / 12:29 PM IST

    CM Jagan

    Follow us on

    CM Jagan: ఏపీ సీఎం జగన్ రాజకీయాల్లోకి రాకమునుపే.. అసలు సిసలైన వ్యాపారవేత్త. ఒకవైపు కుటుంబం రాజకీయాల్లో ఉండగా.. అదే రాజకీయాలతో తన వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని.. డొల్ల కంపెనీలతో క్విడ్ ప్రోకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. లక్షల రూపాయలతో కంపెనీలు ఏర్పాటు చేసి.. ప్రజా ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి…వారి వద్ద నుంచి పెట్టుబడుల రూపంలో లంచాలు తీసుకొని.. ఆ కంపెనీలను వేల కోట్ల ఆస్తిపరులుగా మార్చేశారన్నది ప్రధాన ఆరోపణ. సాక్షి దినపత్రిక, భారతి సిమెంట్స్ లో ఇదేవిధంగా పెట్టుబడులు పెట్టించుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

    తాజాగా ఇండోసోల్ అనే కంపెనీ పేరు వినిపిస్తోంది. ఏడాది కిందట పది లక్షల పెట్టుబడితో ఈ కంపెనీని ప్రారంభించారు. ఎక్కడా ఒక్క ఆఫీస్ ఉండదు. ఉత్పత్తి ఉండదు. అయినా సరే విశాఖపట్నం ఏకంగా 76 వేల కోట్ల పెట్టుబడిని ఈ కంపెనీ ప్రకటించింది. వెంటనే ప్రభుత్వం కొన్ని వేల ఎకరాలను ఆ కంపెనీకి ఇచ్చేసింది. ఇంతకీ ఈ కంపెనీ ఎవరిదో తెలుసా? జగన్కు అత్యంత సన్నిహితులు అయిన నర్రెడ్డి విశ్వేశ్వర్ రెడ్డిది. ఇదే ఇండోసోల్ కంపెనీలో అరబిందో గ్రూప్ 49% వాటాలను కొనుగోలు చేసింది. ఈ అరబిందో కంపెనీ విజయసాయిరెడ్డి అల్లుడు కుటుంబానికి చెందినదే. అంటే సీఎం జగన్ తో పాటు కీలక నేతల సన్నిహితులకు ఒక పద్ధతి ప్రకారం ఏపీలో ఉన్న భూములు బదలాయిస్తున్నారన్నమాట.

    ఒక్క ఏపీ ప్రభుత్వం నుంచి భూములే కాదు.. ఏమీ లేని కంపెనీకి విదేశాల నుంచి పెట్టుబడులు వస్తుండడం విశేషం. ఈ కంపెనీలో వాటాలను జపాన్ కు చెందిన ఓ సంస్థకు విక్రయిస్తున్నారు. వేలకోట్ల రూపాయలు విదేశీ పెట్టుబడులు రూపంలో వస్తున్నట్లు తెలుస్తోంది. పది లక్షల పెట్టుబడి తో ప్రారంభమైన ఈ కంపెనీకి ఒకవైపు ఏపీలో ప్రభుత్వ భూములు, మరోవైపు విదేశీ పెట్టుబడులు ఎలా సమకూర్చుకుంటున్నారో తెలుస్తోంది. గతంలో భారతి సిమెంట్స్ విషయంలో కూడా ఇదే జరిగింది. 15 సంవత్సరాల కిందటే వికాట్ అనే కంపెనీకి అమ్మేశారు. 2000 కోట్ల రూపాయలకు విక్రయించారు. కానీ భారతీ సిమెంట్స్ లో జగన్ రెడ్డి కుటుంబ వాటా అక్షరాల 49 శాతమే. కానీ వికాట్ అనే పేరు అధికారికంగా ఉంటుంది. లావాదేవీలంతా జగన్ కుటుంబానిదే.

    ఇప్పుడు తెరపైకి వచ్చిన ఇండోసోల్ కంపెనీలో సైతం ఇదే తతంగం జరుగుతున్నట్లు తెలుస్తోంది. అవినీతి సంపాదనను విదేశాలకు పంపించి.. అక్కడి నుంచి పెట్టుబడుల రూపంలోకి సొంత సంస్థల్లోకి రప్పిస్తున్నారని అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. కానీ రాష్ట్ర, జాతీయ దర్యాప్తు సంస్థలు, నిఘా వర్గాలు పసిగట్ట లేకపోవడం విశేషం. ఇటువంటి వ్యాపారములో అలవాటు పడిన ఈ బ్యాచ్ మరోసారి తమ ప్రతాపాన్ని చూపేందుకు ప్రయత్నిస్తుండడం విశేషం.