Pawan Kalyan : జనసేన అధినేత పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓ వైపు హీరోయిజం, మరో వైపు రాజకీయాల్లో పయణం ఇలా రెండు పడవల మీద ఆయన ప్రయాణం సాఫీగా సాగుతుంది. సినిమాలో స్టార్ హీరోగా హోదా సంపాదించిన పవన్ రాజకీయాల్లో బాస్ అవ్వాలని ప్రజలకు అండంగా ఉండాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ కుటుంబం కోసం హీరో అవకపోతే ఏం అయ్యేవారో తెలుసా?
హీరోగా ఎంట్రీ ఇవ్వాలని అనుకోలేదట పవర్ స్టార్. కెరీర్ తొలినాళ్లలో డైరెక్టర్ కావాలనుకున్నారట పవన్. అయితే కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో ఆ వైపు అడుగులు వేయలేదట పవర్ స్టార్. తన కోరిక ప్రకారం ఓ షార్ట్ ఫిల్మ్ తీశారట.
న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో షార్ట్ టర్మ్ కోర్స్ కోసం పవన్ కళ్యాణ్ దరఖాస్తు చేసుకోవడంతో పాటు ఒక షార్ట్ ఫిల్మ్ ను పంపారు. అంధుల గురించి షార్ట్ ఫిల్మ్ తీసిన ఈ స్టార్ వెనుకడుగు వేశారు. అయితే ఈ న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో ఫీజు ఎక్కువగా ఉండటం, ఇతర కారణాల వల్ల ముందడుగు వేయలేకపోయారట పవన్ కళ్యాణ్.
అంతే కాదు కుటుంబ సభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా నడుచుకోవాలి అనుకోలేదట. మరి తర్వాత అయినా ఈ షార్ట్ ఫిల్మ్ ను యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారా అంటే.. ఇప్పటికీ కూడా అది అందుబాటులో లేదు. కనీసం ఇప్పుడైనా పవన్ కళ్యాణ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ షార్ట్ ఫిల్మ్ ను అప్లోడ్ చేస్తే బాగుండు అని కోరుకునే వారు ఎందరో ఉన్నారు. మరి చూడాలి ఈ షార్ట్ ఫిల్మ్ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో? అయినా దాని కాపీ ఉండాలి? ముందే పవర్ స్టార్ కు ఇది ఫుల్ బిజీ టైమ్. ఇలాంటి సమయంలో దాని గురించి ఆలోచించడం కూడా కష్టమే…